అతిచవకైన రెడ్‌మి గో సేల్‌  | RedGo Price in India Rs. 4,499Flipkart and Mi.com Sale at 2pm Today | Sakshi
Sakshi News home page

అతిచవకైన రెడ్‌మి గో సేల్‌ 

Published Tue, Mar 26 2019 10:40 AM | Last Updated on Tue, Mar 26 2019 10:49 AM

RedGo Price in India Rs. 4,499Flipkart and Mi.com Sale at 2pm Today - Sakshi

సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమికి చెందిన అతి చవకైన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు నేడు (మార్చి26) ప్రారంభం కాన్నాయి.  ఆప్‌ కీ నయీ దునియా ట్యాగ్‌తో లాంచ్‌ చేసిన రెడ్‌మి గో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు  ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలనుంచి ప్రారంభం. గత వారం లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండవ సేల్‌ ఇది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200  ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు.  బ్లూ అండ్‌ బ్లాక్‌ కలర్స్‌లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర  రూ. 4499గా  వుంది.  

రెడ్‌మిగో ఫీచర్లు 
5 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్  425 చిప్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఒరియో 
1జీబీ ర్యామ్, 8జీబీ  స్టోరేజ్‌
8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement