Budget Smartphone
-
రూ.7,499లకే సరికొత్త స్మార్ట్‌ఫోన్..
లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్. చౌక ధరలో స్మార్ట్ఫోన్లు అందించే చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్‌లో సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు డిసెంబర్ 18 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. పోకో సీ65 స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. వీటి సేల్ డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్‌ను రూ.7,499 లకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు కూడా రూ. 10,000 లోపే లభిస్తాయి. పోకో సీ65 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 8,499, 6జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 9,499, 8+256GB 8జీబీ/256జీబీ వేరియంట్‌కు రూ. 10,999 ధరను కంపెనీ నిర్ణయించింది. అయితే స్పెషల్ సేల్ డే రోజున ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా వీటిని వరుసగా రూ.7,499, రూ. 8,499, రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు పాస్టెల్ బ్లూ, మాట్టే బ్లాక్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతాయి.ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో సీ65 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 6.74 అంగుళాల HD+ 90Hz డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ 10 వాట్ C-టైప్ ఛార్జర్ సపోర్ట్ -
తక్కువ ధరకు రియల్మీ ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
రియల్మీ నార్జో ఎన్55(Realme Narzo N55) అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. బడ్జెట్ కేటగిరీ ఫోన్ అయిన దీని ప్రారంభ ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్, రియల్మీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్మీ నార్జో ఎన్55 రెండు రకాల ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్‌తో 64బీజీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.10,999. మరో వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.12,999. పరిచయ ఆఫర్లో భాగంగా 4జీబీ ర్యామ్ వేరియంట్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును ప్రకటించింది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. Realme Narzo N55 ఫీచర్లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే ముందు భాగంలో పంచ్ హోల్ కెమెరా కటౌట్, ఫ్రంట్ కెమెరా MediaTek Helio G88 ప్రాసెసర్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ 2MP డెప్త్ సెన్సార్‌తో 64MP మెయిన్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా 5,000 mAh బ్యాటరీ, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ -
Nokia C12: నోకియా మరో బడ్జెట్ ఫోన్ లాంచ్, ధర చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. సీ సిరీస్‌లో భాగంగా సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించింది. నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.3అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ ర్యామ్ స్ట్రీమ్లైన్డ్ OS 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ఫో 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ మార్చి 17 నుండి ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్కోల్ , లైట్ మింట్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్ థ్రెట్ నేపథ్యంలో వినియోగదారులకు తమ సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. Introducing the all new Nokia C12, with Octa core processor, 4GB RAM, Night and Portrait mode on front and rear cameras, and the trust of Nokia phones. Get your hands on Nokia C12 to be #FullOnConfident pic.twitter.com/sSmmIKDf1f — Nokia Mobile India (@NokiamobileIN) March 13, 2023 -
ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధర: ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా ఆకర్షణీయమైన సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘లావా బ్లేజ్’ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చిన ఈ మొబైల్లో వెనుక గ్లాస్ ఫినిషింగ్, ట్రిపుల్ కెమెరా, బిగ్‌స్క్రీన్ వాటర్‌డ్రాప్ నాచ్ లాంటి ప్రీమియం ఫీచర్లను జోడించింది. పోకో సీ31, రియల్మీ సీ30 లాంటి ఫోన్లకు గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. లావా బ్లేజ్ అసలు ధరను రూ.9,699 గా నిర్ణయించిన కంపెనీ ప్రత్యేక ఆఫర్ కింద రూ.8,699కే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ కోనుగోళ్లపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కి అందుబాటులో ఉంది. జూలై 15 నుండి సేల్స్ ప్రారంభం. ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి లావా ఇయర్ బడ్స్ ఉచితం. Introducing Blaze by Lava #HaqSeChamak ₹8,699 ✔ Premium glass back design ✔ 64GB ROM and 3+3*GB RAM ✔ 13MP Triple AI Rear Camera Pre-booking is LIVE on Blaze. First 500 successful registrations get a chance to win FREE** Probuds. Prebook now: https://t.co/jwGAftqOhl *T&C pic.twitter.com/p0O41PeHXd — Lava Mobiles (@LavaMobile) July 7, 2022 లావా బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5 అంగుళాల IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12, 1600 x 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్ ఎంట్రీ-లెవల్ సాక్ మీడియా టెక్ హీలియో ఏ 22 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం . 13+2 ఎంపీ కెమెరా + VGA సెన్సార్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జర్ -
సూపర్ ఫీచర్స్‌తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్‌లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్‌ఫోన్‌ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్‌లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్‌ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్‌ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్‌డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్..! -
అతిచవకైన రెడ్మి గో సేల్
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి చెందిన అతి చవకైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నేడు (మార్చి26) ప్రారంభం కాన్నాయి. ఆప్ కీ నయీ దునియా ట్యాగ్‌తో లాంచ్ చేసిన రెడ్మి గో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలనుంచి ప్రారంభం. గత వారం లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ రెండవ సేల్ ఇది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో పాటు 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. బ్లూ అండ్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 4499గా వుంది. రెడ్‌మిగో ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ టచ్‌స్క్రీన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఒరియో 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 5 ప్రొ.. భారీ ఆఫర్
రెడ్మి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షావోమి ఆశ్చర్యకర ఆఫర్ ప్రకటించింది. పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ ధరపై 3 వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్తగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 2018 సంవత్సరానికి సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రకటించిన టెక్, ఆటో అవార్డుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ ‘బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. అవార్డు వచ్చిన సందర్భంగా సర్ప్రైజ్ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మానుకుమార్ జైన్ తెలిపారు. ఎంఐ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్సైట్లలో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందనేది ఆయన వెల్లడించలేదు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : చైనీస్ హ్యాండ్సెట్ తయారీదారి వివో తన ‘వై’ సిరీస్‌ను విస్తరించుకుంటూ వెళ్తోంది. ఈ విస్తరణలో భాగంగా ఆల్ట్రా-హెడ్ టెక్నాలజీతో ‘వై53ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను వివో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 7,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌కు ఆల్ట్రా-హెడ్ టెక్నాలజీ కూడిన 8 ఎంపీ రియర్ కెమెరా, 32ఎంపీ వరకు రెజుల్యూషన్ కలిగిన ఫోటోలను తీసే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్‌కు 5ఎంపీ ఫ్రంట్ షూటర్ ఉంది. తక్కువ వెలుతురులో కూడా సెల్ఫీలను తీసుకునేందుకు వీలుగా ‘స్క్రీన్ ఫ్లాష్’ ఫీచర్‌ను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. క్రౌన్ గోల్డ్, మేట్ బ్లాక్ రంగుల్లో అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వై53ఐ స్మార్ట్‌ఫోన్‌తో పోటీకరమైన ధర విధానంలో యూజర్లకు మంచి అనుభవాన్ని, అత్యుత్తమమై కెమెరాను అందించేందుకు తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నామని వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగీ తెలిపారు. ఈ ఫోన్‌కు 5 అంగుళాల డిస్ప్లే, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. -
డ్యూయల్ రియర్ కెమెరాతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ‘శాంసంగ్ గెలాక్సీ జే7 డ్యూ’ పేరుతో రూ.16,990కు దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చిన తమ తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని శాంసంగ్ ప్రకటించింది. 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ షూటర్ 8 మెగాపిక్సెల్‌గా ఉంది. నలుపు రంగు ఆప్షన్లో ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. గెలాక్సీ జే7 డ్యూ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1.6గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫిజికల్ హోమ్ బటన్ వద్ద ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బడ్జెట్ ధరలో శాంసంగ్ కొత్త ఫోన్
గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. బడ్జెట్ ఓరియెంటెంట్ గా 'గెలాక్సీ జే3 ప్రైమ్' పేరుతో దీన్ని అమెరికా మార్కెట్లో లాంచ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. దీని ధర 150 డాలర్లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 9,600 రూపాయలు ఉండొచ్చు. ఈ కొత్త గెలాక్సీ జే3 ప్రైమ్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో రన్ అవుతుంది. బడ్జెట్ ధరల్లో లాంచ్ అవుతున్న జే సిరీస్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్లో భారీగా డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే క్వాడ్ కోర్ 1.4గిగాహెడ్జ్ ఎక్సీనోస్ 7570ఎస్ఓసీ 1.5జీబీ ర్యామ్ 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డుతో 128జీబీ వరకు విస్తరణ మెమరీ 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2600 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి 3ఎస్ వచ్చేస్తోంది!
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి రెడ్మి సిరీస్‌లో మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. తొలుత రెడ్మి 1ఎస్, తర్వాత 2ఎస్‌లను రిలీజ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా రెడ్మి 3ఎస్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫోన్ బుధవారమే భారతీయ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం దీని ధర ఎంతో ఇంకా చెప్పలేదు. రెడ్మి సిరీస్‌లో 2, 2ప్రైమ్ తర్వాత వస్తు్న్న ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లో విడుదల చేశారు. ఫోన్ ఫీచర్లు ఇవీ.. ప్రాసెసర్ - క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ర్యామ్ - 2 జీబీ స్క్రీన్ - 5 అంగుళాల డిస్ప్లే వెనక కెమెరా - 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా - 5 మెగాపిక్సెల్ బ్యాటరీ - 4100 ఎంఏహెచ్ ఇంటర్నల్ మెమొరీ - 16 జిబి ఆండ్రాయిడ్ వెర్షన్ - 5.1 లాలిపాప్