సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా ఆకర్షణీయమైన సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘లావా బ్లేజ్’ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో వెనుక గ్లాస్ ఫినిషింగ్, ట్రిపుల్ కెమెరా, బిగ్‌స్క్రీన్ వాటర్‌డ్రాప్ నాచ్ లాంటి ప్రీమియం ఫీచర్లను జోడించింది. పోకో సీ31, రియల్‌మీ సీ30 లాంటి ఫోన్లకు గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
లావా బ్లేజ్ అసలు ధరను రూ.9,699 గా నిర్ణయించిన కంపెనీ ప్రత్యేక ఆఫర్ కింద రూ.8,699కే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ కోనుగోళ్లపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కి అందుబాటులో ఉంది. జూలై 15 నుండి సేల్స్ ప్రారంభం. ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి లావా ఇయర్ బడ్స్ ఉచితం.
Introducing Blaze by Lava #HaqSeChamak
— Lava Mobiles (@LavaMobile) July 7, 2022
₹8,699
✔ Premium glass back design
✔ 64GB ROM and 3+3*GB RAM
✔ 13MP Triple AI Rear Camera
Pre-booking is LIVE on Blaze. First 500 successful registrations get a chance to win FREE** Probuds.
Prebook now: https://t.co/jwGAftqOhl
*T&C pic.twitter.com/p0O41PeHXd
లావా బ్లేజ్ స్పెసిఫికేషన్స్
6.5 అంగుళాల IPS LCD స్క్రీన్
ఆండ్రాయిడ్ 12, 1600 x 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్
ఎంట్రీ-లెవల్ సాక్ మీడియా టెక్ హీలియో ఏ 22
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం .
13+2 ఎంపీ కెమెరా + VGA సెన్సార్
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 mAh బ్యాటరీ, 10W ఛార్జర్
Comments
Please login to add a commentAdd a comment