Lava Company
-
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్‌తోపాటు, వన్‌ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్‌లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధర: ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా ఆకర్షణీయమైన సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘లావా బ్లేజ్’ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చిన ఈ మొబైల్లో వెనుక గ్లాస్ ఫినిషింగ్, ట్రిపుల్ కెమెరా, బిగ్‌స్క్రీన్ వాటర్‌డ్రాప్ నాచ్ లాంటి ప్రీమియం ఫీచర్లను జోడించింది. పోకో సీ31, రియల్మీ సీ30 లాంటి ఫోన్లకు గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. లావా బ్లేజ్ అసలు ధరను రూ.9,699 గా నిర్ణయించిన కంపెనీ ప్రత్యేక ఆఫర్ కింద రూ.8,699కే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ కోనుగోళ్లపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కి అందుబాటులో ఉంది. జూలై 15 నుండి సేల్స్ ప్రారంభం. ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి లావా ఇయర్ బడ్స్ ఉచితం. Introducing Blaze by Lava #HaqSeChamak ₹8,699 ✔ Premium glass back design ✔ 64GB ROM and 3+3*GB RAM ✔ 13MP Triple AI Rear Camera Pre-booking is LIVE on Blaze. First 500 successful registrations get a chance to win FREE** Probuds. Prebook now: https://t.co/jwGAftqOhl *T&C pic.twitter.com/p0O41PeHXd — Lava Mobiles (@LavaMobile) July 7, 2022 లావా బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5 అంగుళాల IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12, 1600 x 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్ ఎంట్రీ-లెవల్ సాక్ మీడియా టెక్ హీలియో ఏ 22 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం . 13+2 ఎంపీ కెమెరా + VGA సెన్సార్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జర్ -
బంపరాఫర్..! ఉచితంగా రూ. 20 వేల విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్...!
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్స్ అనూహ్యమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఉచితంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుదారులు పొందే అవకాశాన్ని లావా మొబైల్స్ కల్పిస్తోంది. ఈ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే..! స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల కోసం లావా ఆసక్తికరమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద న్యూ లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు రియల్మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 7 వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రిజిస్ట్రేషన్ వ్యవధిలో కొనుగోలుదారులు తమ పేరు, చిరునామా ఇతర ప్రాథమిక వివరాలను వెబ్సైట్లో నమోదుచేయాల్సి ఉంటుంది. లావా కంపెనీకి చెందిన ‘అగ్ని మిత్ర(ఎగ్జిక్యూటివ్)’ ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రియల్మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరించిన తరువాత కొత్త లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తారు. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 20 వేలుగా ఉంది. 2021లో లావా మొబైల్స్ లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ 6.78-అంగుళాల పూర్తి హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 64ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000 mAh బ్యాటరీ 8జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చదవండి: 5G Phones: జస్ట్ మూడేళ్ల కంపెనీ..! 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ.! -
అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ లావా ఇంటర్నేషనల్ తన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీని నేడు దేశంలో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో క్వాడ్ రియర్ కెమెరాలు, 30 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది. లావా అగ్ని 5జీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గల 90హెర్ట్జ్ డిస్ ప్లేతో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 8జీబీ ర్యామ్, 10 ప్రీలోడెడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 8ఎస్ 5జీ, మోటో జీ 5జీ, శామ్ సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ వంటి వాటితో పోటీపడనుంది. లావా అగ్ని 5జీ ధర: లావా అగ్ని 5జీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. నవంబర్ 18 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా దేశంలో అమ్మకానికి వస్తుంది. నేటి నుంచి అమెజాన్, లావా ఇ-స్టోర్ ద్వారా ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 5జీని ముందస్తుగా బుకింగ్ చేసుకునే కస్టమర్లు ప్రాథమిక మొత్తం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వీరికి ఫోన్ మీద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. లావా అగ్ని 5జీ ఫీచర్స్: డిస్ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ ర్యామ్, స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బ్యాక్ కెమెరా: 64 ఎంపీ, 5 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ బ్యాటరీ: 5,000 ఎమ్ఎహెచ్ 5జీ: డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఓఎల్టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సి పోర్ట్ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆంబియంట్ లైట్ సెన్సార్, ప్రోమిసిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ (చదవండి: చాపకింద నీరులా.. రోడ్లపై రయ్ రయ్ మంటూ ఎలక్ట్రిక్ ట్రక్లు) -
అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదుగుతాం!
నాలుగైదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను లక్షకు చేరుస్తాం ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 18 లక్షలకు విస్తరిస్తాం .త్వరలో భారత్‌లోనూ డిజైన్– రీసెర్చ్–డెవలప్మెంట్ లావా ఇంటర్నేషనల్ వీపీ మహాజన్, సీఎంఓ రైనా చైనాలోని షెంజెన్ ఆర్ అండ్ డీ కేంద్రం సందర్శన డిజైన్, టెస్టింగ్‌కు అధిక ప్రాధాన్యమని వివరణ ఎనిమిదేళ్లలోనే టాప్ దేశీ బ్రాండ్స్‌లో ఒకటిగా మారిన లావా మొబైల్స్... భారత్ నుంచి సిసలైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో తనకున్న హ్యాండ్సెట్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించటం... అదే సమయంలో మిగతా పోటీదారులకన్నా భిన్నంగా రీసెర్చ్–డెవలప్మెంట్ కార్యకలాపాల్ని పటిష్ఠం చేసుకోవటం అనే రెండంచెల వ్యూహంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రెండేళ్ల కిందట నోయిడాలో తొలి అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేసిన సంస్థ... మేకిన్ ఇండియా స్ఫూర్తితో గతేడాది అక్కడే మరో ప్లాంటునూ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడే మూడో ప్లాంటును పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ సామర్థ్యంతో ఇంకొక ప్లాంటును కూడా ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఇవన్నీ అనుకున్నట్లు పూర్తయితే సంస్థ ఉత్పాదక సామర్థ్యం నెలకు 18 లక్షల మొబైల్స్‌కు చేరుతుంది. ‘‘ఇవన్నీ అమలు కావటానికి కొంత సమయం పడుతుంది. ఈ లోగా మేం మార్కెట్ విస్తరణపై కూడా దృష్టి పెడుతున్నాం. నిజానికిపుడు మా అమ్మకాలు, ఉత్పత్తి అన్నీ బాగున్నాయి. కానీ అది సరిపోదు. కాబట్టే మాకు మేమే సవాలు విసురుకుంటూ ఎక్సలెన్స్ స్థాయిని చేరేలా అడుగులేస్తున్నాం’’ అని సంస్థ ప్రొడక్ట్ విభాగ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మహాజన్ తెలియజేశారు. భారతదేశంలోని పలు భాషాపత్రికల పాత్రికేయులకు చైనాలోని షెంజెన్‌లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాల్ని ఆయన చూపించారు. నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగేందుకు డిజైన్, సాఫ్ట్వేర్ పరిశోధన, టెస్టింగ్ రంగాల్లో తామెలా కృషి చేస్తున్నదీ ప్రత్యక్షంగా వివరించారు. ఒక్కో ఫోన్‌కు సగటున ఆరునెలలు... లావా ఇంటర్నేషనల్‌కు ప్రధాన మార్కెట్ ఇండియానే అయినా... ప్రస్తుతం 13 దేశాల్లో తమ ఫోన్లను విక్రయిస్తోంది. కొన్ని దేశాల్లో మార్కెట్ లీడర్‌గానూ ఉంది. సంస్థకు దేశంలో 15వేల మంది ఉద్యోగులుండగా చైనాలోని రీసెర్చ్– డెవలప్మెంట్ కేంద్రంలో దాదాపు 400 మంది వరకూ పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా చైనీయులే. ‘‘రాత్రికి రాత్రి ఏవో కొన్ని స్పెసిఫికేషన్లను కాంట్రాక్టు తయారీదారులకు చెప్పేసి... వారం రోజుల్లో ఫోన్ తీసుకుని మార్కెట్లోకి విడుదల చేయటమనే సంస్కృతికి మేం వ్యతిరేకం. భారీ డిజైన్ టీమ్‌తో పాటు ఫోన్లో దాదాపు 70 శాతాన్ని ఆక్రమించే సర్క్యూట్, చిప్, కెమెరా, ఎల్సీడీ, స్పీకర్, బ్యాటరీ వంటి ప్రధాన పరికరాల్ని ఎంపిక చేసేందుకు అనుభవజ్ఞులైన నిపుణులున్నారు. ఆ పరికరాల్ని రకరకాలుగా టెస్టింగ్ చేసే సౌకర్యాలున్నాయి. అవన్నీ చూశాకే మా ఫోన్‌ను తయారీ దారులకిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తవటానికి ఒకో ఫోన్‌కు సగటున ఆరునెలలు పడుతోంది’’ అని దీపక్ వివరించారు. తమ ఫోన్లలోని పరికరాల పనితీరు తాము చెప్పినదానికన్నా మెరుగ్గానే ఉంటుందని, వినియోగదారుల విశ్వాసం పొంది దేశం నుంచి నిజమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగేందుకు తమ టీమ్ కృషి చేస్తోందని చెప్పారాయన. దేశంలోనే రీసెర్చ్ కూడా!! భారతదేశంలోనే పూర్తిస్థాయి రీసెర్చ్, డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తమకున్నా... అది నెరవేరటానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చని దీపక్ చెప్పారు. ‘‘చైనాలోని అత్యుత్తమ యూనివర్సిటీలకు వెళ్లి యువకుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాం. వారికి సీనియర్లు మార్గదర్శనం చేస్తున్నారు. ఇండియాలో మొబైల్ ఎకో సిస్టమ్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. కాబట్టి సమయం పడుతుంది’’ అని చెప్పారాయన. లావా రీసెర్చ్, డిజైన్ ఉద్యోగుల్లో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే కావటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ పనిచేస్తోందని, ఈ బృందం తొలిసారిగా డిజైన్ చేసిన ఫీచర్ ఫోన్‌ను ఇటీవలే మార్కెట్లోకి తెచ్చామని కూడా దీపక్ ఈ సందర్భంగా చెప్పారు. చైనాలో ఈ స్థాయి ఆర్ అండ్ డీ నెట్వర్క్ ఉన్న భారతీయ సంస్థ తమదేనన్నారు. నిజం! ఇది ఇండియా టైమ్!! ప్రపంచంలోని దిగ్గజ బ్రాండ్లు తొలుత అమెరికాలో పుట్టినా... తరవాత ఆ అవకాశాలు యూరప్, కొరియా, జపాన్ మీదుగా ప్రయాణించి చైనాకు చేరాయని, ఇపుడవి ఇండియా తలుపుతడుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ రైనా తెలియజేశారు. ‘‘ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి మేమూ సిద్ధంగా ఉన్నాం. నా అంచనా ప్రకారం వచ్చే దశాబ్దంలో ఇండియా నుంచి సిసలైన అంతర్జాతీయ బ్రాండ్లు ఉద్భవిస్తాయి’’ అని చెప్పారాయన. లావాకు సొంత రిటైల్ నెట్వర్క్ ఉందని, అదే తమ బలమని చెప్పారాయన. మార్కెటింగ్‌లో దూకుడుకన్నా నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే ముఖ్యమన్నది తమ ఉద్దేశమని రైనా తెలియజేశారు. కాగా సంస్థ ఇప్పటికే మార్కెటింగ్‌లో రెండేళ్ల వారంటీ అనే సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. వీటికి సంబంధించి తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో మరో కొత్త ప్రచారం ఆరంభించబోతున్నట్లు కూడా తెలిసింది. (ఎం.రమణమూర్తి) -
లావా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ @రూ.5,699
న్యూఢిల్లీ : లావా కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఫ్లెయిర్ జెడ్1ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,699 అని కంపెనీ తెలి పింది. ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 1.3 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొం ది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభిస్తామని, ఈ నెల 30 నుంచి స్నాప్‌డీల్‌లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది. -
లావా ఐరిస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్లు
న్యూఢిల్లీ: లావా కంపెనీ ఐరిస్ సిరీస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్లను అందిస్తోంది. ఐరిస్ ఫ్యూయల్ బ్రాండ్ కింద అందిస్తున్న ఈ మొబైల్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలముంటుందని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ చెప్పారు. ఈ బ్రాండ్ ఫోన్లలో మొదటిగా ఐరిస్ ఫ్యూయల్ 50ను అందిస్తున్నామని, ధర రూ.7,799 అని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, చార్జింగ్ లేకుండా ఒకటిన్నర రోజులు ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు. ఈ ఫోన్లో 5 అంగుళాల స్క్రీన్ డిస్ప్లే, 8 మెగా పిక్సెల్ ఆటో-ఫోకస్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1.3 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.