లావా ఐరిస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్‌లు | Lava launches Iris Fuel 50 smartphone at Rs 7799 | Sakshi
Sakshi News home page

లావా ఐరిస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్‌లు

Published Sat, Nov 1 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

లావా ఐరిస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్‌లు

లావా ఐరిస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్‌లు

న్యూఢిల్లీ: లావా కంపెనీ ఐరిస్ సిరీస్‌లో కొత్త బ్రాండ్ మొబైల్ ఫోన్లను అందిస్తోంది. ఐరిస్ ఫ్యూయల్ బ్రాండ్ కింద అందిస్తున్న ఈ మొబైల్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలముంటుందని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ చెప్పారు. ఈ బ్రాండ్ ఫోన్లలో మొదటిగా ఐరిస్ ఫ్యూయల్ 50ను అందిస్తున్నామని, ధర రూ.7,799 అని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, చార్జింగ్ లేకుండా ఒకటిన్నర రోజులు ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు. ఈ ఫోన్‌లో 5 అంగుళాల స్క్రీన్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సెల్ ఆటో-ఫోకస్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1.3 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement