డ్యూయల్‌ రియర్‌ కెమెరాతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ | Samsung Galaxy J7 Duo Smartphone Launched | Sakshi
Sakshi News home page

డ్యూయల్‌ రియర్‌ కెమెరాతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

Published Thu, Apr 12 2018 12:21 PM | Last Updated on Thu, Apr 12 2018 12:23 PM

Samsung Galaxy J7 Duo Smartphone Launched - Sakshi

శాంసంగ్‌ గెలాక్సీ జే7 డ్యూ స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌ మరో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ‘శాంసంగ్‌ గెలాక్సీ జే7 డ్యూ’  పేరుతో రూ.16,990కు దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వచ్చిన తమ తొలి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని శాంసంగ్‌ ప్రకటించింది. 13 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్‌ షూటర్‌ 8 మెగాపిక్సెల్‌గా ఉంది. నలుపు రంగు ఆప్షన్‌లో ఇది మార్కెట్‌లో లభ్యమవుతుంది.

గెలాక్సీ జే7 డ్యూ ఫీచర్లు...
5.5 అంగుళాల హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ డిస్‌ప్లే
1.6గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఫిజికల్‌ హోమ్‌ బటన్‌ వద్ద ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement