
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో రెడ్ మీ 8ఏ నేడు ( గురువారం, సెప్టెంబర్ 25) చేసింది. దీని ప్రారంభ ధర రూ. 6499. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 6,999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ఈ నెల 30 నుంచి విక్రయానికి లభ్యం. దమ్‌దార్ రెడ్‌మి 8ఏలో వైర్‌లెస్ ఎఫ్‌ఎం, టైప్ సీ చార్జర్ స్పెషల్ ఫీచర్ లాంటి ఎనిమిది దమ్‌దార్ ఫీచర్లున్నాయని అని కంపెనీ చెబుతోంది. రెడ్‌మి ఏ సిరీస్ లో వచ్చిన రెడ్‌మీ 7ఏ తరువాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే కొత్త డివైస్‌ను లాంచ్ చేయడం విశేషం.
రెడ్‌మీ 8 ఏ ఫీచర్లు
6.22 ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1520×720 పిక్సెల్స్‌రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9పై
19:9 రేషియే వాటర్‌డ్రాప్ నాచ్ కార్నింగ్‌గ్లాస్ 5
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 439
2/3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ