
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి అందిస్తున్న అయిదు ఆఫర్లలో మూడవదాన్ని నేడు ప్రకటించింది. రెడ్ మి వై 2పై తగ్గింపును ప్రకటించింది. ఎంఆర్‌పీ ధరపై మూడువేల రూపాయల డిస్కౌంట్‌తో రూ.8999 (3జీబీ/32జీబీ) అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించింది. హై ఎండ్ వెర్షన్ ధర (4జీబీ/64జీబీ స్టోరేజ్) ను 10, 999లకు విక్రయిస్తోంది. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లతోపాటు ఎంఐ హోంఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.
కాగా హై5లో షావోమి ఇప్పటికే ఎంఐ2, రెడ్‌మి నోట్ 5ప్రొ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
It's time for the 3rd #High5! Get up to ₹3,000 off on the #RedmiY2. Get yours today from https://t.co/cwYEXeds6Y, @amazonIN, Mi Home, offline stores. It's time to #FindYourSelfie.
— Redmi India (@RedmiIndia) January 9, 2019
RT if you know what the next #High5 is going to be. pic.twitter.com/Gy4RkizFYf