
న్యూఢిల్లీ: రెడ్ మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ ధర మళ్లీ పెరిగింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఫోన్ రేటు రూ. 500 పెరిగి 12,499 రూపాయలకు చేరింది. జూన్ నెలలో జీఎస్టీ పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పతనం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. (రెడ్‌మీ 10 ఎక్స్ వచ్చేసింది..)
అయితే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తున్న మరో వేరియంట్ ధరలో ఎలాంటి మార్పురాలేదు. దీని ధర ప్రస్తుతం 14,499 రూపాయలుగా ఉంది. నోట్ 8ను రెడ్ మీ 2019లో 9,999 రూపాయలకు లాంచ్ చేసింది. అంటే మొత్తం మీద దీని రేటు 2,500 రూపాయలు పెరిగిందన్నమాట. సవరించిన ధరలను ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇక రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను ఈనెల 20న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు షావోమి వెల్లడించింది. (లీకైన రెడ్‌మి 9 వివరాలు..)