
10 భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు: వెంకయ్య
హైదరాబాద్: ప్రపంచం చూపంతా భారత్ వైపే ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అందరికీ ఆశాదీపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ పిలుపుకు సాంకేతిక దిగ్గజ సంస్థలు సానుకూలంగా స్పందించాయని తెలిపారు.
500 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయం కల్పించేందుకు గూగుల్ ముందుకు వచ్చిందన్నారు. ఆండ్రాయిడ్ సేవలు 10 భారతీయ భాషల్లో అందించేందుకు గూగుల్ సుముఖంగా ఉందన్నారు. 5 లక్షల గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని వెంకయ్య తెలిపారు.