నిద్రిస్తున్న జంటను లేపి మరీ... | Breaking Into Home Asking for WiFi Password Teen Arrested | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 29 2018 1:14 PM | Last Updated on Sun, Jul 29 2018 1:14 PM

Breaking Into Home Asking for WiFi Password Teen Arrested - Sakshi

నిద్రిస్తున్న జంటను లేపి మరీ షాకిచ్చాడు ఓ యువకుడు. ముసుగు ధరించి ఇంట్లోకి దొంగలాగ దూరి ఆ దంపతులను బెదిరించాడు. అయితే అతను అడిగిన ప్రశ్నకు బిత్తర పోయిన ఆ జంట.. తన్ని బయటకు తరిమేశారు. నార్తర్న్‌ కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... 

పాలో అల్టో పోలీసులు వెల్లడించిన వివరాల​ ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఈస్ట్‌ ఛార్లెస్టన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధ జంటను లేపి తన ఫోన్‌లోని డేటా అయిపోయిందని.. వైఫై పాస్‌వర్డ్‌ చెప్పాలని కోరాడు. అంతే కంగుతిన్న ఆ ఇంటి యాజమాని కంగారులో యువకుడ్ని మెడ బట్టి బయటకు గెంటేశాడు. ఆపై పోలీసులకు ఫోన్‌ చేయగా.. యాజమాని ఇచ్చిన క్లూస్‌ మేరకు మరుసటి రోజు అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదే రాత్రి  ఆ ప్రాంతంలో ఓ బైక్‌ మిస్సింగ్‌ కంప్లైయింట్‌ రావటంతో సదరు యువకుడిని అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు.

సెక్స్‌లో పాల్గొన్నాడు.. పొద్దున్నే షాకిచ్చాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement