Northern California
-
ఘనంగా సిలికానంధ్ర సంస్థాపక దినోత్సవ వేడుకలు
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం ఈ వేడకకు వేదికయ్యింది. గత 22ఏళ్ల ఆనవాయితీ ప్రకారం.. ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయ్యింది. సంస్థాపక దినోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో, ఆకెళ్ల రచించిన శ్రీనాథుడు పూర్తి నిడివి తెలుగు పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్ర పోషించగా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులు పాత్రలతో మమేకమైపోయారు. శ్రీనాథుడి జీవిత చరమాంక సన్నివేశాల్లో సభలో కంటతడి పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నాటకం అనంతరం డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా గుమ్మడి గోపాలకృష్ణకు సన్మానం జరిగింది. ఆయనకు శాలువా కప్పి పదివేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బూదరాజు శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఒక పద్యనాటక ప్రదర్శన చూడలేదని పేర్కొన్నారు. సిలికానంద్ర కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికంతా పొగ కమ్మేయగా సిరివెన్నెలే వచ్చారా అన్నట్టుగా వారి కుమారుడు యోగిని వాళ్ళ నాన్నగారిలా వేదిక మీదకి రావడం ఆహూతులకు ఆశ్చర్యానంద అనుభూతిని కలిగించింది.సిరివెన్నెల కుటుంబసభ్యుల సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే ఏడాది నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యక్షులు డా. కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. అలానే ప్రతీ సంవత్సరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో సిరివెన్నెల స్మారకోపన్యాసము, సిరివెన్నెల స్మారక పతకం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. -
టెకీ ఉన్మాదం.. కారులో శవంతో
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికాలోని రోస్‌విల్లేలో నివసిస్తున్న భారత సంతతి సాఫ్ట్వేర్ ఉద్యోగి శంకర్ నాగప్ప హంగుడ్(53) దారుణానికి తెగబడ్డాడు. తన కుటుంబంలో ఒక వ్యక్తిని హత్య చేసిన అతడు.. శవాన్ని కారులో తీసుకువెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అదే విధంగా మరో ముగ్గురిని కూడా హత్య చేశానని.. వారి మృతదేహాలు తన అపార్టుమెంటులో ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో నాగప్ప చెబుతుంది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మొదట అతడి కారును పరిశీలించిన పోలీసులు.. ఆ తర్వాత అతడి అపార్టుమెంటుకు వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్ల శవాలను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు మూడు శవాలను అక్కడే వదిలేసి.. ఒక శవాన్ని తీసుకుని దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తర కాలిఫోర్నియా పోలీసు స్టేషనుకు వచ్చి లొంగిపోయాడని తెలిపారు. కాగా నాగప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. పాశవికంగా హత్యలకు పాల్పడిన అతడికి కోర్టు బెయిలు కూడా నిరాకరించిందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. ఇక ఈ విషయం గురించి రోస్‌విల్లే పోలీసు అధికారి మాట్లాడుతూ.. మృతులు నిందితుడి బంధువులా కాదా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. నాగప్ప ఘాతుకంతో రోస్‌విల్లే ప్రాంతంలో అలజడి చెలరేగిందని... ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. తన సర్వీసులో ఎంతోమంది నేరస్తులను చూశానని.. అయితే నాగప్ప ఉదంతం వంటిది ఎన్నడూ చూడలేదని.. ఇది తనకు షాకింగ్‌గా ఉందని వ్యాఖ్యానించారు. ప్రముఖ కంపెనీల్లో ఐటీ ఉద్యోగిగా పనిచేసిన నాగప్ప ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాల గురించి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
నిద్రిస్తున్న జంటను లేపి మరీ...
నిద్రిస్తున్న జంటను లేపి మరీ షాకిచ్చాడు ఓ యువకుడు. ముసుగు ధరించి ఇంట్లోకి దొంగలాగ దూరి ఆ దంపతులను బెదిరించాడు. అయితే అతను అడిగిన ప్రశ్నకు బిత్తర పోయిన ఆ జంట.. తన్ని బయటకు తరిమేశారు. నార్తర్న్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పాలో అల్టో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఈస్ట్ ఛార్లెస్టన్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధ జంటను లేపి తన ఫోన్లోని డేటా అయిపోయిందని.. వైఫై పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. అంతే కంగుతిన్న ఆ ఇంటి యాజమాని కంగారులో యువకుడ్ని మెడ బట్టి బయటకు గెంటేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేయగా.. యాజమాని ఇచ్చిన క్లూస్ మేరకు మరుసటి రోజు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రాత్రి ఆ ప్రాంతంలో ఓ బైక్ మిస్సింగ్ కంప్లైయింట్ రావటంతో సదరు యువకుడిని అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు. సెక్స్‌లో పాల్గొన్నాడు.. పొద్దున్నే షాకిచ్చాడు -
ఉత్తర కాలిఫోర్నియాలో స్వల్ప భూకంపం
కాలిఫోర్నియా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 1.17 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) మెన్డోసినో కౌంటీలోని దక్షిణ కొవెలో ఈ భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. పశ్చిమ సాంక్రమెంటోకు 120 కిలోమీటర్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. -
ఫేస్ బుక్ కార్యాలయానికి 'ఫేక్' బాంబు బెదిరింపు!
బాంబు బెదిరింపు రావడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. ఓ గంటపాటు తనిఖీలు చేపట్టిన తర్వాత.. ఎలాంటి సమస్య లేదని సెక్యూరిటీ సిబ్బంది తేల్చడంతో ఫేస్ బుక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 7 గంటలకు నార్తర్న్ కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ కార్యాలయానికి బెదిరింపు వచ్చిందని శాన్ ఫ్రానిసిస్కో పోలీసులు వెల్లడించారు. అకతాయిలు చేసిన పని అని పోలీసులు అన్నారు. బెదిరింపు వార్తలో వాస్తవం లేదని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఉద్యోగులు పని ప్రారంభించారు. ఆ సమయంలో ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో 6 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మెల్నో పార్క్ పోలీస్ కమాండర్ డేవ్ బెర్టినీ వెల్లడించారు. -
ఉత్తర కాలిఫోర్నియా జడ్జిగా భారతీయుడు
లాస్ ఏంజిలెస్: ప్రముఖ భారతీయ-అమెరికన్ న్యాయవాది సునీల్ ఆర్. కులకర్ణి (41) ఉత్తర కాలిఫోర్నియాలో జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా ఈ పదవి పొందిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఘనత సాధించారు. ఆయన్ను గవర్నర్ జెర్రీ బ్రౌన్ శాంటా క్లారా కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా గత వారం నియమించినట్లు స్థానిక పత్రిక ఇండియా వెస్ట్ తెలిపింది. లాస్ ఏం జిలెస్లో జన్మించిన కులకర్ణి కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో స్థిరపడ్డారు. -
ఉత్తర కాలిఫోర్నియా జడ్జిగా ఎన్నారై సునీల్
ప్రముఖ ఎన్నారై న్యాయవాది సునీల్ ఆర్ కులకర్ణి (41) ఉత్తర కాలిఫోర్నియా కోర్టుకు జడ్జిగా నియమితులయ్యారని భారతీయ సంతతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా వెస్ట్ పత్రిక శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా వాసిగా ఆయన చరిత్ర సృష్టించారని తెలిపింది.తనను ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసినట్లు గవర్నర్ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న తాను ఒక్కసారిగా ఆనందం కలిగిందని సునీల్ తెలిపారని పేర్కొంది. అమెరికాలో దక్షిణాసియా వాసులు చాలా మంది న్యాయవాద వృత్తిని ఎంచుకుని ఆ రంగంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. శ్రీకాంత్ శ్రీనివాసన్, పౌల్ సింగ్ అగర్వాల్, రూప ఎస్ గోస్వామి తదితర ఎన్నారైలు యూఎస్ న్యాయవ్యవస్థలో పలు కీలక స్థానాలను ఆధిరోహించిన సంగతిని సునీల్ ఆర్ కులకర్ణి ఈ సందర్భంగా గుర్తు చేశారు. లాస్ ఎంజిల్స్‌లో జన్మించిన కులకర్ణి కాలిఫోర్నియాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారని చెప్పింది. యూసీ -బర్కిలీ నుంచి ఆయన బీఎస్ డిగ్రీ అందుకున్నారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా హస్టింగ్ కాలేజ్ నుంచి కులకర్ణి లా డిగ్రీ పట్టా పుచ్చుకున్నారని ఇండియా వెస్ట్ పత్రిక పేర్కొంది.