ఉత్తర కాలిఫోర్నియా జడ్జిగా భారతీయుడు
లాస్ ఏంజిలెస్: ప్రముఖ భారతీయ-అమెరికన్ న్యాయవాది సునీల్ ఆర్. కులకర్ణి (41) ఉత్తర కాలిఫోర్నియాలో జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా ఈ పదవి పొందిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా ఘనత సాధించారు. ఆయన్ను గవర్నర్ జెర్రీ బ్రౌన్ శాంటా క్లారా కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా గత వారం నియమించినట్లు స్థానిక పత్రిక ఇండియా వెస్ట్ తెలిపింది. లాస్ ఏం జిలెస్‌లో జన్మించిన కులకర్ణి కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో స్థిరపడ్డారు.