ఫేస్ బుక్ కార్యాలయానికి 'ఫేక్' బాంబు బెదిరింపు! | Facebook headquarters cleared after false threat | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ కార్యాలయానికి 'ఫేక్' బాంబు బెదిరింపు!

Published Thu, Mar 13 2014 12:09 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్ బుక్ కార్యాలయానికి 'ఫేక్' బాంబు బెదిరింపు! - Sakshi

ఫేస్ బుక్ కార్యాలయానికి 'ఫేక్' బాంబు బెదిరింపు!

బాంబు బెదిరింపు రావడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. ఓ గంటపాటు తనిఖీలు చేపట్టిన తర్వాత.. ఎలాంటి సమస్య లేదని సెక్యూరిటీ సిబ్బంది తేల్చడంతో ఫేస్ బుక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
 
మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 7 గంటలకు నార్తర్న్ కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ కార్యాలయానికి బెదిరింపు వచ్చిందని శాన్ ఫ్రానిసిస్కో పోలీసులు వెల్లడించారు.
 
అకతాయిలు చేసిన పని అని పోలీసులు అన్నారు. బెదిరింపు వార్తలో వాస్తవం లేదని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఉద్యోగులు పని ప్రారంభించారు. ఆ సమయంలో ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో 6 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మెల్నో పార్క్ పోలీస్ కమాండర్ డేవ్ బెర్టినీ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement