సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు దగా చేస్తూనే ఉన్నారు. తాజాగా సంక్రాంతి పండుగ వేళ కూడా ప్రజలకు చేదు అనుభవమే మిగిలింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేళ ప్రజలను దగా చేశారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి మంగళం పాడారు. ప్రతీ ఏటా సంక్రాంతి కానుక సరుకులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అందుకు విరుద్దంగా తొలి సంక్రాంతికి కూడా చంద్రబాబు ప్రభుత్వం కానుక ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో మాత్రం సంక్రాంతి కానుక ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు.
మరోవైపు.. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పండగ వేళ మోసం తప్పలేదు. తాము గెలిచి కూటమి అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చాక మాత్రం ఉద్యోగులను తీవ్రంగా మోసం చేశారు. కూటమి సర్కార్ ఏర్పాటై.. ఏడు నెలలు అవుతున్నా ఐఆర్ మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. దీంతో.. ప్రజలు, ఉద్యోగులు ఉసూరుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment