ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు లోబడి నగరంలో ఉచిత వైఫై ఏర్పాటుకు ఆప్ సర్కారు తన యత్నాలను ముమ్మరం చేసింది.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు లోబడి నగరంలో ఉచిత వైఫై ఏర్పాటుకు ఆప్ సర్కారు తన యత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు కంపెనీలతో పాటు ఫేస్‌బుక్ యాజమాన్యంతో సంప్రదింపులు ప్రారంభించింది. దీనికి దాదాపుగా రూ.150-200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముంబైలో ఇప్పటికే వైఫై సర్వీసులు ప్రారంభించిన ఫేస్‌బుక్‌తోను, మరి కొన్ని ఇతర కంపెనీలతోను చర్చలు ప్రారంభించినట్టు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.
ఉచిత సేవల్లో భాగంగా మొదటి 30 సెకండ్లు ప్రకటనలు వస్తాయని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్లు వరకూ ఆదాయం సమకూరనుందన్నారు. దేశ రాజధానిలో యువతను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో ఇచ్చి హామీకి అనుగుణంగా ఉచిత వైఫై వసతి కల్పిస్తామని కాబోయే ఉప ముఖ్యమంత్రి మనీష్ తెలిపారు. మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఆ తరువాత సర్వీసులపై డ బ్బు చెల్లించాలన్నారు. కాగా మహిళల రక్షణకు సంబంధించి యాప్‌ను విడుదల చేస్తామని ఆప్ వర్గాలు తెలిపాయి.