ఏసీ బస్సుల్లో వైఫై ప్రారంభం
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది. నగరంలో తిరిగే ఏసీ బస్సుల్లో ఇక నుంచి అరగంటపాటు ఉచిత వైఫై వాడుకునే అవకాశం కల్పించారు. ఏసీ బస్సుల్లో 4జీ వైఫై సౌకర్యాన్ని సంస్థ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ, ఎండీ రమణారావులు బుధవారం ప్రారంభించారు. ఈ బస్సుల్లో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై వినియోగించుకోవచ్చని, ఆ తరువాత అరగంటకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రవేశపెడతామని చైర్మన్ తెలిపారు. మొదటి విడతలో 115 ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించారు. కాగా, పెద్ద నోట్ల రద్దుతో చిల్లర లేక ప్రజలు బస్సులు ఎక్కడం తగ్గిందని, దాంతో ఆర్టీసీ రోజుకు రూ. 60 లక్షల ఆదాయం కోల్పోతున్నట్లు ఆయన తెలిపారు.