
ఓలా క్యాబ్ ల్లో ఆటో వైఫై !
న్యూఢిల్లీ: మైక్రో, మినీ క్యాబ్‌లతో పాటు ఆటోల్లోనూ వైఫై సేవలనందించాలని ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రైమ్ కేటగిరి వినియోగదారులకు కారులో వైఫై సర్వీసులందిస్తోంది. తమ క్యాబ్‌లో ప్రయాణించే వినియోగదారులకు ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యేలా వైఫై సర్వీస్‌ను అందిస్తున్నామని ఓలా పేర్కొంది. వినియోగదారులు ఒకసారి అథంటికేషన్ పొందితే, ఎప్పుడు తమ క్యాబ్‌ల్లో ప్రయాణించినా, వైఫై సర్వీసులకు తక్షణం కనెక్ట్ కావచ్చని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రఘువేశ్ సరూప్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఆటో కనెక్ట్ వైఫై సర్వీస తమ ప్రైమ్ కేటగిరి వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. త్వరలో మైక్రో, మినీ, ఆటో వినియోగదారులకు కూడా ఈ సౌకర్యాన్ని అందించనున్నామని తెలియజేశారు.