
యాప్ కాఫీ
రోజూ ఉదయాన్నే ఒకే టైమ్‌కు నిద్ర లేవాలంటే ఏం చేస్తాం.. అలారంలో టైమ్ సెట్ చేసి పెట్టుకుంటాం. మరి రోజూ అదే టైమ్‌కి చేతిలోకి కాఫీ రావాలంటే..? అలాగే కాఫీ పెట్టుకోవాల్సిన టైమ్‌లో మీరు ఎక్కడో బయట ఉన్నా సరే.. ఇంటికొచ్చే సరికి కాఫీ రెడీగా ఉండాలంటే..? ఇదెలా సాధ్యం అనుకునేవారికి.. పెద్ద షాక్ ఇచ్చేందుకే వచ్చాడు ‘మిస్టర్ కాఫీ’.. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ మిస్టర్ కాఫీ పనితీరు గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. మీ ఫోన్లో వైఫై ఉంటే చాలు. ఆఫీస్, సినిమా థియేటర్..
ఇలా ఎక్కడున్నా ఇంటికెళ్లే ఏడు నిమిషాల ముందు మీ ఫోన్‌లో ఒక్క బటన్ నొక్కితే చాలు.. ఇంట్లో కాఫీ రెడీ అయిపోతుంది. ఇంకేముంది వెళ్లగానే వేడి వేడి కాఫీని లాగించేయొచ్చు. అంతేకాదు.. ఇంట్లో ఉండి కూడా ఒక్కోసారి కాఫీ పెట్టుకోవాలంటే బద్దకిస్తుంటాం. కానీ ఈ మిస్టర్ కాఫీకి ఒక్కసారి టైమ్ సెట్ చేస్తే చాలు.. వారం రోజులపాటు అదే టైమ్‌కు కాఫీ ఆటోమెటిక్‌గా రెడీ అయిపోతుంది.