హైదరాబాద్లో మరో 200 ఫ్రీ వైఫై కేంద్రాలు..
హైదరాబాద్ : నగరవాసులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి వైఫై సదుపాయం కోసం వేచి చేస్తున్నవారికి జీహెచ్ఎంసీ ఉపశమనం కలిగించబోతోంది. వైఫై సేవలందించేందుకు హైదరాబాద్లో 200 వైఫై కేంద్రాలను గుర్తించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ 10 కోట్లు కూడా కేటాయించారు.
ఇందిరా పార్క్, కేబిఆర్ పార్క్, సంజీవయ్య పార్క్, తదితర ప్రాంతాలతోపాటు సెంట్రల్ మాల్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్ లాంటి ప్రాంతాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించాలని జీహెచ్ఎంపీ యోచిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూడు గంటలపాటు ఉచిత వైఫై సేవలు తొలత అందించి ఆ తరువాత పూర్తి స్థాయిలో ఈ సేవలను అందించాలనుకొంటోంది.
ఇందుకు సంబంధించి అతి త్వరలోనే ఈ మెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వనుంది, ఇందులో సంప్రదించిన వారికి వైఫై పాస్‌వర్డ్‌ను అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. కాగా ఇప్పటికే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు 8కిలోమీటర్ల మేరకు ఈ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.