క్రెడిట్‌ కార్డు కోసం ఇంటర్నెట్‌లో వెతికి.. బొక్కబోర్లా పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ | Cyber Crime: Software Engineer Lost 50 Thousand Over Credit Card Issue | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల వలలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

Published Tue, Oct 19 2021 9:20 PM | Last Updated on Tue, Oct 19 2021 9:28 PM

Cyber Crime: Software Engineer Lost 50 Thousand Over Credit Card Issue - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిద్దిపేట: సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ డబ్బులు పోగొట్టుకున్నాడు. సిద్దిపేట త్రీటౌన్‌ పోలీస్‌ త్రీటౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని రంగధాంపల్లికి చెందిన నిమ్మ కార్తీక్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో క్రెడిట్‌ కార్డు కార్డుకు దరఖాస్తు చేసుకోగా, బ్యాంకు నుంచి కార్డు వచ్చింది. క్రెడిట్‌ కార్డును యాక్టివేట్‌ చేసే విధానం తెలుసుకునేందుకు ఇంటర్‌నెట్‌లో వెతకగా, సైబర్‌ నేరగాళ్లు క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌కు సంబంధించిన వివరాలు చెబుతామంటూ, మొబైల్‌కు ఓ లింక్‌ పంపించారు.
చదవండి: రైలుకు ఎదురెళ్లి.. గాలిలోకి లేచి.. పది కిలోమీటర్ల తర్వాత..

లింక్‌ను ఓపెన్‌ చేసి కార్డును యాక్టివేట్‌ చేసుకోవాలని సూచించారు. లింక్‌ను ఓపెన్‌ చేయగా క్రెడిట్‌ కార్డు నుంచి రూ.49,995 కట్‌ అయినట్టు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి విచారించగా కార్డు నుంచి డబ్బులు డ్రా అయినట్టు చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
చదవండి: తల్లి ఇంట్లో ఉండగా ప్రియుడికి ఫోన్‌ చేసి రప్పించి ఎంత పనిచేసింది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement