credit card fraud
-
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
గల్ఫ్‌లో భారీ ‘క్రెడిట్’ స్కాం.. విషయం తెలిస్తే షాక్!
నిజామాబాద్: గల్ఫ్ ఏజెంట్లు నయా స్కాంకు తెరలేపారు. గతంలో కొందరు నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసేవారు. మరికొందరు విజిట్ వీసాపై పంపించి.. పనిచూపించకుండా.. వర్క్ పర్మిట్ ఇప్పించకుండా మోసం చేసేవారు. తాజాగా కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. వీసాలు ఇప్పించి దుబా య్కు పిలిపించుకుని కొన్ని రోజుల పాటు తమ వద్ద ఉంచుకొని.. వీరి పేర్ల మీద క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు తీసుకొని వారిని తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంక్ సిబ్బంది ఈఏంఐలు చెల్లించాలని బెదిరింపులకు దిగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో తాము తీసుకోని రుణాలకు ఈఎంఐ లు ఎలా చెల్లిస్తామని బాధితులు మంగళవారం పోలీస్‌కమిషనర్ కల్మేశ్వర్‌ను ఆశ్రయించారు. స్పందించిన సీపీ వెంటనే విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్‌రాజును ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. దుబాయ్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రతినెలా రూ. 40వేల నుంచి రూ. 50వేల వేతనంతో పాటు రూ. 50 లక్షల క్రెడిట్ కార్డు సౌకర్యం ఉంటుందని జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌కు చెందిన ఏజెంట్ పబ్బ భూమేశ్ అలియాస్ దండిగాళ్ల భూమేశ్ అలియాస్ భూమారెడ్డి సబ్ ఏజెంట్లను నమ్మబలికాడు. దీంతో డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన భోజారాం మరో ఇద్దరు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకు చెందిన 82 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 6లక్షల చొప్పున వీసాకు వసూలు చేశారు. వీరి నుంచి వసూలు చేసిన సుమారు రూ. 5కోట్లను దఫాల వారీగా పబ్బ భూమేశ్ సూచించిన వారికి చెల్లించారు. డొంకేశ్వర్ మండలం అన్నారంనకు చెందిన భోజారం నిజామాబాద్‌లోని శ్రీదేవి ట్రావెల్స్‌కు చెందిన బెజ్జం సుబ్బారెడ్డికి రూ. 2కోట్లను చెల్లించాడు. వెంటనే డబ్బులు చెల్లించినట్లు భోజారాం పబ్బ భూమేశ్‌కు వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ చేశారు. తర్వాత ఆర్మూర్‌కు చెందిన అరెపల్లి మోహన్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు రూ. 3కోట్లు భోజారం చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వీరికి దుబాయ్ విజిట్ వీసాలను దశల వారీగా ఇప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వీసాలు వచ్చిన బాధితులు గ్రూపులుగా దుబాయ్‌కి వెళ్లారు. వీరిని పబ్బ భూమేశ్ ఏర్పాటు చేసిన రూంలో ఉంచారు.. 82 మందిలో 30 మందికి మాత్రమే వర్క్ పర్మిట్ ఇప్పించి.. క్రెడిట్ కార్డులు ఇప్పించాడు. బాధితుల క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు విత్‌డ్రా.. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 82 మందిలో 30 మందికి వర్క్ వీసాలు రావడంతో పబ్బ భూమేశ్ అక్కడి క్రెడిట్ కార్డు బ్యాంక్ సిబ్బందితో అరబ్బీ, ఇంగ్లిష్‌లలో ఉన్న ఫారాలపై సంతకాలు చేయించాడు. తన అడ్రస్పైనే క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అవి రాగానే వాటి నుంచి మరో రూ. 5 కోట్లు డ్రా చేసినట్లు బాధితులు సీపీకి విన్నవించారు. క్రెడిట్ కార్డులకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిఫాల్ట్ కావడంతో పబ్బ భూమేశ్ 30 మందిని ఇండియా వెళ్లిపోవాలని.. వీసా సమస్య తలెత్తిందని.. లేదంటే జైలుకు వెళ్తారని భయభాంత్రులకు గురిచేశారు. దీంతో బాధితులు భోజారాంనకు ఫోన్ చేసి తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో త్వరగా ఇండియాకు వెళ్తే.. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తిరిగి ఇచ్చేస్తానని పబ్బ భూమేశ్ బాధితులకు చెప్పి పంపించేశాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడు. అంతేకాకుండా దుబాయ్‌లోని క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంకు సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు సీపీని ఆశ్రయించారు. వైద్యానికి డబ్బులు లేక.. రూ. 6 లక్షలు చెల్లించిన ఓ గల్ఫ్ బాధితుడి కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక కొడుకును కాపాడుకోలేకపోయాడు. అలాగే మరో బాధితుడు అప్పులు ఇచ్చిన వారు వేధించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని సబ్ ఏజెంట్ భోజారం తెలిపారు. బాధితులు చెల్లించిన రూ. 5కోట్లు వారికి అందేలా చూడాలని సీపీ కల్మేశ్వర్‌ను కోరినట్లు భోజారం చెప్పారు. నాలుగు నెలల క్రితం ఆర్మూర్ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. విచారణ చేపడుతున్నాం సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు గల్ఫ్‌లో జరిగిన మోసంపై విచారణ చేపట్టాం. సబ్ ఏజెంట్ భోజారం డబ్బులు ఎవరికి ఇచ్చారనే దానిపై విచారిస్తాం. బెజ్జం సుబ్బారెడ్డి, ఆరెపల్లి మహేశ్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు డబ్బులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని అంశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేని ఏజెంట్లకు డబ్బులు చెల్లించి మోసపోవద్దు. – రాజశేఖరరాజు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, నిజామాబాద్ ఇవి చదవండి: బీచ్‌లో మెడికో మృతదేహం -
సైబర్ కేటుగాళ్లు ఎంత దోచేశారంటే.. ప్రభుత్వం లెక్కలు!
ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్, ఆర్థిక మోసాలు సైతం అదే స్థాయిలో పెగుతున్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, ఆర్థిక సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. దేశంలో మూడేళ్లలో నమోదైన సైబర్, ఆర్థిక మోసాల కేసుల వివరాలను ప్రభుత్వం తాజాగా తెలియజేసింది. 12,000 మోసాలు.. రూ.461 కోట్లు దేశవ్యాప్తంగా మూడేళ్లలో సైబర్, ఆర్థిక మోసాలు భారీగానే జరిగాయి. ‘కార్డ్/ఇంటర్నెట్/ఏటీఎం / డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు’ కేటగిరి కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం సుమారు 12,000 మోసాలు నమోదయ్యాయని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వీటి ద్వారా రూ.461 కోట్ల మేర బాధితులు మోసపోయారని పేర్కొంది. ఇదీ చదవండి: రుణాల ‘ఎవర్‌గ్రీనింగ్’కు చెక్.. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం మరోవైపు సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాడ్యూల్ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి నాలుగు లక్షలకు పైగా ఘటనల్లో రూ. 1,000 కోట్లకుపైగా బాధితులు మోసపోకుండా కాపాడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ టెలికాం శాఖ అందించిన వివరాలను ఉటంకిస్తూ తెలిపారు. నకిలీ పత్రాలతో తీసుకున్నవి, అనుమానిత కనెక్షన్లు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాల్లో ప్రమేయం ఉన్నవి దాదాపు 72 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు పేర్కొన్నారు. -
ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది. ► 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్సైట్ల ద్వారా మోసపోయారు. ► 10 శాతం మంది వెబ్సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు. ► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది. ► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు. ► సంబంధిత ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు. ► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు. ► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు. ► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది. -
స్కామ్ సొమ్ముతో వర్సిటీ ఫీజు.. నగర వాసిని మోసం చేసిన ఎన్నారై
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్ స్కిమ్మింగ్ గ్యాంగ్‌తో చేతులు కలిపిన ఓ ఎన్నారై నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేశాడు. ఆయన కుమారుడి లండన్ యూనివర్శిటీ ఫీజులో కొంత తన కార్డు ద్వారా చెల్లిస్తానని, ఆ మొత్తాన్ని హైదారాబాద్‌లోని తన సోదరుడి ఖాతాలో వేయాలన్నాడు. పన్నులు కలిసి వస్తాయని భావించిన బాధితులు అలానే చేశారు. ఆనక లండన్ పోలీసులు వచ్చి వర్శిటీ నుంచి సొమ్ము రికవరీ చేసుకుపోతే కానీ అసలు విషయం తెలీదు. ఈ వ్యవహారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చేరడంతో కేసు నమోదైంది. నగరంలో ఉన్న ఎన్నారై తమ్ముడు అరెస్టు వరకు వ్యవహారం వెళ్లడంతో బాధితులకు నగదు తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. ►నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు లండన్‌లోని బీపీపీ యూనివర్శిటీలో పీజీ సీటు వచ్చింది. మొత్తం ఫీజు 11 వేల యూరోలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో తొలి విడత రూ.6 లక్షలు యూరోలుగా మార్చి కట్టడానికే ఎక్స్ఛేంజ్, పన్నుల చెల్లించాల్సి వచ్చింది. ఈ కుటుంబానికి పరిచయమున్న కరుణాకర్‌రెడ్డి అనే ఎన్నారై ఆ సమయంలో రంగంలోకి దిగాడు. ►అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్, స్కిమ్మింగ్ ద్వారా నకిలీవి తయారు చేసే ముఠాతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం దాచి పెట్టిన కరుణాకర్ బాధిత కుటుంబంతో తన కార్డులో రూ.5 లక్షలు యూరోలుగా చెల్లిస్తానని, తనకు రివార్డ్స్ పాయింట్స్‌గా, బాధిత కుటుంబానికి ఎక్స్ఛేంజ్, పన్నులు మిగిలి లాభం ఉంటుందని చెప్పాడు. ►నిజమేనని నమ్మిన బాధితులు అంగీకరించి రూ.5 లక్షల్ని నగరంలో ఉన్న కరుణాకర్ సోదరుడు ప్రశాంత్ ఖాతాలో జమ చేశారు. కరుణాకర్ మాత్రం క్లోన్డ్ క్రెడిట్ కార్డుతో బీఆర్ఆర్ వర్శిటీకి మిగిలిన ఫీజు చెల్లించేశాడు. రూ.5 లక్షల్లో 30 శాతం మినహాయించి మిగిలింది ప్రశాంత్ ఢిల్లీలో ఉన్న సుశాంత్ అనే వ్యక్తి ఖాతాకు పంపాడు. ఇతడు కూడా గ్యాంగ్‌లో సభ్యుడిగా అనుమానిస్తున్నారు. ►షెడ్యూల్ ప్రకారం లండన్ వెళ్లిన నగర యువకుడు వర్శిటీలో చేరాడు. ఓ రోజు హఠాత్తుగా వర్శిటీకి వచ్చిన అక్కడి పోలీసులు ఇతడిని అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. మరో వ్యక్తి క్రెడిట్ కార్డు స్కిమ్మింగ్ చేసి ఫీజు కట్టిన నేరంపై కేసు నమోదైందని చెప్పారు. దీంతో ఖంగుతిన్న నగర యువకుడు వారికి విషయం చెప్పాడు. ►దీంతో అతడిని వదిలిపెట్టిన పోలీసులు వర్శిటీ నుంచి రూ.5 లక్షలు (యూరోల రూపంలో) రికవరీ చేసుకువెళ్లారు. సీటు కాపాడుకోవడానికి నగరంలోని అతడి కుటుంబం ఆ మొత్తం తక్షణం చెల్లించాల్సి వచ్చింది. ఆపై వీళ్లు ప్రశాంత్‌ను నిలదీసి తమ డబ్బు తిరిగి చెల్లించాలని కోరారు. దీనికి ససేమిరా అన్న అతగాడు ఆ మొత్తం తన సోదరుడు చెప్పినట్లు ఢిల్లీకి బదిలీ చేశానన్నాడు. ►బాధితులు గత నెల్లో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అధికారులు ప్రశాంత్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. అతడు కరుణాకర్‌ను సంప్రదించినా స్పందన లేదు. దీంతో ఆ మొత్తం తాను చెల్లిస్తానంటూ బాధితులతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం ముట్టిన తర్వాత కేసు ఉపసంహరించుకుంటామని బాధితులు సైబర్ ఠాణాకు సమాచారం ఇచ్చారు. -
క్రెడిట్ కార్డు చార్జీలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తుండగా..
సాక్షి, బాలానగర్: క్రెడిట్ కార్డు యూజర్ చార్జీల విషయం తెలుసుకునేందుకు గూగుల్‌ను సంప్రదించిన ఓ వ్యక్తి నగదు పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌లో నివాసం ఉండే కె.రాజుగౌడ్‌కు ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అయితే క్రెడిట్ కార్డు యూజర్ చార్జీలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తుండగా ఓ వ్యక్తి రాజుగౌడ్‌కు ఫోన్ చేసి ఇండస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానంటూ.. మీ ఫోన్‌కు లింకు పంపిస్తా.. దాంట్లో మీ వివరాలు పంపండి అని చెప్పాడు. ఇది నమ్మిన రాజుగౌడ్ అతడు చెప్పిన విధంగానే వివరాలు పంపించాడు. వెంటనే ఓటీపీ వచ్చింది. మీకు వచ్చిన ఓటీపీ నంబర్ చెబితే మీకు వివరాలు తెలుస్తాయని చెప్పడంతో రాజుగౌడ్ అదే విధంగా చేశాడు. కొద్ది సేపటి తరువాత అతడి అకౌంట్ నుంచి రూ.1,35,300 నగదు విత్‌డ్రా అయినట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: అయ్యో బిడ్డా! నువ్వు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి -
సెల్ ఫోన్ స్క్రీన్ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని చెప్పి..
హైదరాబాద్: క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతామంటూనమ్మించి అతని ఖాతాలో నుంచి రూ.50 వేలను కాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరా ల ప్రకారం.. ప్రైవేటు సంస్థలో పనిచేసే మారంరెడ్డి నర్సింహ వెంగళరావునగర్ కాలనీలోని ధన్‌రాజ్ అపార్ట్మెంట్లో నివసముంటన్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ప్రతినిధుల్లా మాట్లాడారు. మీరు వాడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు లిమిట్ రూ.55 వేల నుంచి లక్షా 25 వేలకు పెంచుతామని నమ్మబలికారు. ఇందుకు సెల్ ఫోన్ స్క్రీన్ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని తెలుపడంతో నర్సింహ స్క్రీన్‌ను షేరింగ్ చేశాడు. అనంతరం ఒక ఓటీపీ నెంబర్‌ను పంపి నమోదు చేయాలని చెప్పారు. ఓటీపీ నమోదు చేయగానే రూ.50 వేలు ఖాతాలో గల్లంతయ్యాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసును శనివారం ఎస్ఆర్నగర్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రెడిట్ కార్డు కోసం ఇంటర్నెట్లో వెతికి.. బొక్కబోర్లా పడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాక్షి, సిద్దిపేట: సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ డబ్బులు పోగొట్టుకున్నాడు. సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ త్రీటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని రంగధాంపల్లికి చెందిన నిమ్మ కార్తీక్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇండస్ఇండ్ బ్యాంకులో క్రెడిట్ కార్డు కార్డుకు దరఖాస్తు చేసుకోగా, బ్యాంకు నుంచి కార్డు వచ్చింది. క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసే విధానం తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో వెతకగా, సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు యాక్టివేషన్‌కు సంబంధించిన వివరాలు చెబుతామంటూ, మొబైల్‌కు ఓ లింక్ పంపించారు. చదవండి: రైలుకు ఎదురెళ్లి.. గాలిలోకి లేచి.. పది కిలోమీటర్ల తర్వాత.. లింక్‌ను ఓపెన్ చేసి కార్డును యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు. లింక్‌ను ఓపెన్ చేయగా క్రెడిట్ కార్డు నుంచి రూ.49,995 కట్ అయినట్టు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి విచారించగా కార్డు నుంచి డబ్బులు డ్రా అయినట్టు చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తల్లి ఇంట్లో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసి రప్పించి ఎంత పనిచేసింది.. -
‘క్రెడిట్’కు ఇంటర్నేషనల్ కాటు
సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ కరెన్సీలో భాగమైన క్రెడిట్‌కార్డుల క్లోనింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఒకప్పుడు స్థానిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండగా... ఇటీవల కాలంలో అంతర్జాతీయ లావాదేవీలు పెరిగి పోయాయి. ‘చార్జ్ బ్యాక్’ సదుపాయం నేపథ్యంలో ఈ క్రైమ్ వల్ల ఆర్థిక నష్టం లేకపోయినా.. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. డెబిట్‌కార్డులు క్లోనింగ్ బారిన పడవని, క్రెడిట్ కార్డులకు మాత్రం తప్పట్లేదని వివరిస్తున్నారు. ‘ప్రైవేట్’ డేటా లీక్... దాదాపు ప్రతి బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తూ ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తాన్ని వినియోగించుకోవడానికి డెబిట్, అప్పుగా వినియోగించుకుని ఆపై చెల్లించడానికి క్రెడిట్‌కార్డులు ఉపకరిస్తాయి. డెబిట్‌కార్డుల తయారీ, నిర్వహణ, జారీ మొత్తం బ్యాంకు ఆదీనంలోనే జరుగుతుంది. అయితే క్రెడిట్‌కార్డులకు సంబంధించింది మాత్రం ఆయా బ్యాంకులు ఔట్సోర్సింగ్ లేదా ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఇక్కడే సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తున్న డేటా అంతర్జాతీలం ద్వారా అమ్ముడైపోతోంది. ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉండటంతో పాటు అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం ఉండటంతోనే ఈ డేటాకు డిమాండ్ పెరిగింది. అయితే ఇది నేరుగా కాకుండా ఆన్లైన్ అధోజగత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి క్రయవిక్రయాలు సాగుతున్నాయి. దానికి అంతా ప్రత్యేకం... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచి్చ, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా క్రెడిట్‌కార్డుల డేటా వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. దీనిని టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్‌స్టల్ అవుతుంది. ఇలా డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఉన్న డేటాను బిట్‌కాయిన్స్ ద్వారా చెల్లించి సొంతం చేసుకునే ముఠాలు అనేకం ఉన్నాయి. కంప్యూటర్లతో అనుసంధానించి... ఇలా తమ చేతికి వస్తున్న డేటాను సైబర్ నేరగాళ్ళు తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆపై ప్రత్యేకమైన కార్డ్ రైటర్స్‌ను ఈ కంప్యూటర్లకు అనుసంధానిస్తున్నారు. ఆన్లైన్ ద్వారానే వీళ్ళు యాగ్నెటిక్ స్ట్రిప్, చిప్‌లతో కూడిన ఖాళీ కార్డులు ఖరీదు చేస్తున్నారు. వీటిని రైటర్స్‌లో పెట్టడం ద్వారా అప్పటికే డార్క్ వెబ్ నుంచి ఖరీదు చేసిన డేటాను ఖాళీ కార్డుల్లోకి పంపిస్తున్నారు. అంటే వినియోగదారుడి క్రెడిట్‌కార్డు అతడి వద్దే ఉన్నా... నకలు దుండగుడి వద్ద తయారైపోతోంది. దీన్నే సాంకేతిక పరిభాషలో క్లోనింగ్ అంటారు. ఇలా భారతీయులకు చెందిన క్రెడిట్‌కార్డుల్ని పోలిన వాటికి క్లోన్డ్ వెర్షన్స్ విదేశీయులు తయారు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఈ కార్డులను వినియోగించి స్వయంగా షాపింగ్ చేసేవాళ్ళు కొందరైతే... కమీషన్ పద్దతిలో ఇతరుల షాపింగ్స్‌కు డబ్బులు కట్టేవాళ్ళు మరికొందరు ఉంటున్నారు. ఇక్కడ మాదిరిగా విదేశాల్లో క్రెడిట్‌కార్డ్ వినియోగిస్తూ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. ఆ షాపింగ్‌కు సంబంధించిన సందేశం, బిల్లులు మాత్రం ఇక్కడి అసలు వినియోగదారులకి వస్తున్నాయి. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే క్రెడిట్, డెబిట్ కార్డుల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు నెలకు 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. బ్యాంకుల వారికి లేఖలు రాయడం ద్వారా చార్జ్‌బ్యాక్ విధానంలో ఆ డబ్బును కార్డు వినియోగదారుడి ఖాతాలోకి తిరిగి పంపించేలా చేస్తున్నాం. అయితే డేటాను దుర్వినియోగం చేస్తున్న ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ ఇంటర్నేషనల్ క్లోనింగ్ బారినడపకుండా ఉండాలంటే మీ కార్డుల్లో ఇంటర్నేషనల్ లావాదేవీలు చేసే అంశాన్ని డిసేబుల్ చేసుకోండి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా -
భారీ క్రెడిట్ కార్డు మోసం : కోట్లు కొల్లగొట్టారు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ క్రెడిట్ కార్డు మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నాట్ ప్లేస్ బ్రాంచ్‌లో ఉన్న సిటీ బ్యాంక్‌లో ఈ మోసం జరిగింది. మోసగాళ్లు సేవింగ్స్ అకౌంట్లు ఓపెన్‌చేసి, ఆ తర్వాత క్రెడిట్ కార్డులు పొంది, వాటిని ఫుల్‌గా వాడేసుకుని బిల్లులు చెల్లించుకుండా పారిపోయారు. ఇలా బ్యాంక్‌కు రూ.2.4 కోట్ల క్రెడిట్ కార్డుల బకాయిలను చెల్లించలేదు. ఇలాంటివి మొత్తం 36 కేసులు నమోదైనట్టు అమెరికాకు చెందిన సిటీ బ్యాంక్ సీపీ బ్రాంచ్ తెలిపింది. తప్పుడు అడ్రస్‌లతో కస్టమర్లు క్రెడిట్ కార్డులు పొందారని, ఎన్సీఆర్లో పలు ప్రాంతాల్లో వీరు ఈ కార్డులను స్వైప్ చేసినట్టు పేర్కొన్నారు. 35 మంది 15 మంది కార్డులపై రుణాలు కూడా పొందినట్టు రిపోర్టులు వెల్లడించాయి. దీనిపై సిటీ బ్యాంక్ అధికారులు ఢిల్లీ పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేసింది. ‘ప్రభుత్వం ఆమోదించిన ఐడెంటీ డాక్యుమెంట్లు ఆధార్, ప్యాన్, ఓటర్ ఐడీ కార్డులతో వారు క్రెడిట్ కార్డులను పొందారు. బ్యాంక్ అంతర్గత విచారణలో 36 అకౌంట్లలో 16 అకౌంట్లను నలుగురు వ్యక్తులే తెరిచినట్టు వెల్లడైంది’ అని సిటీ బ్యాంక్ నార్త్ జోన్ మేనేజర్ హితేష్ వర్మ తెలిపారు. ఈ నలుగురు అకౌంట్ హోల్డర్స్ కూడా ఒకే నివాసా చిరునామాను అందించారని సిటీ బ్యాంక్ తెలిపింది. 36 మందిలో 11 మంది తాత్కాలిక క్రెడిట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసినట్టు పేర్కొంది. తాత్కాలిక క్రెడిట్ సౌకర్యమనేది క్రెడిట్ కార్డు లేదా బ్యాంక్ ఖాతా ద్వారా జరిపిన లావాదేవీలు ఏమైనా వివాదాస్పదమైతే, బ్యాంక్ ద్వారా జారీ చేసే క్రెడిట్ సిస్టమ్. 36 మంది కస్టమర్లలో 33 మంది కస్టమర్లు వారిచ్చిన రెసిడెన్స్ అడ్రస్‌లలో అసలు వారి నివసించడం లేదని తెలిసింది. నలుగురు రాణి బాగ్‌లో ఉంటున్న ఆఫీసు అడ్రస్‌లను ఇచ్చారు. ఆఫీసు పేరును మార్చి ఇచ్చారు. మొత్తం ఈ కార్డులపై రూ.2.14 కోట్ల మోసం జరిగింది. ఒక్కో కార్డుపై రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మోసం జరిగినట్టు తెలిసింది. -
నగరంలో నకిలీ క్రెడిట్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ క్రెడిట్ కార్డ్‌ల మోసాలపై తాజాగా మరోకేసు వెలుగులోకి వచ్చింది. క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టును హైదరాబాద్ అధికారులు చేధించారు. నగరంలో ఈ మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఎంతో కాలంగా హైదరాబాద్‌లో నకిలీ క్రెడిట్ కార్డులు సృష్టించి మోసాలకు తెగబడింది. సుమారు కోటి యాభై లక్షల రూపాయలకు పైగా సొమ్మును దండుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా పోలీసులు నిఘా వేసి నిర్ధారణకు వచ్చిన వెంటనే కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వారినుంచి నాలుగు బ్యాంకులకు చెందిన 125 నకిలీ క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇలాంటి మోసాలకి పాల్పడుతున్న వారిలో బ్యాంక్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్త!
ముంబై: ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. ప్రత్యేకించి తన పేరుతో క్రెడిట్ కార్డులకు సంబంధించి జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, విదేశీ మారకపు నిధుల సేకరణ-నిల్వ లేదా ఇతర బ్యాంకింగ్ సేవల విషయంలో ఆర్బీఐ నేరుగా వినియోగదారులతో ఎటువంటి లావాదేవీలూ నిర్వహించదని, ఈ విషయంలో తన పేరుతో వచ్చే ఎటువంటి ఆఫర్లనూ విశ్వసించవద్దని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అటువంటి ఆఫర్లను విశ్వసిస్తే, తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతారని సైతం సూచించింది. ఒకసారి ఆయా ఆఫర్లకు సంబంధించి లావాదేవీలు జరిపితే... మోసపోయిన డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీస్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కి ఫిర్యాదు చేయాలని సూచించింది. -
అమెరికాలో క్రెడిట్ కార్డుల మోసం కేసులో నలుగురు భారతీయులు
అమెరికాలో చోటుచేసుకున్న అతిపెద్ద క్రెడిట్ కార్డుల మోసం కేసులో నలుగురు భారతీయులతో సహా మొత్తం 10 మందిపై కేసు నమోదైంది. మొత్తం 1245 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు వారిపై అభియోగాలు నమోదు చేశారు. నిందితులలో వినోద్ దడ్లానీ, విజయ్ వర్మ, అమర్ సింగ్, తర్సీమ్ లాల్ భారతీయులు. మిగిలినవారు న్యూయార్క్, న్యూజెర్సీలకు చెందినవారు. ఈ కేసును మూడు దశల్లో విచారణ చేయనున్నారు. నేరం చేసినట్టు రుజువైతే 30 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. 60 కోట్ల రూపాయలు జరిమానా కూడా ఎదుర్కోనున్నారు.