సాక్షి, బాలానగర్: క్రెడిట్ కార్డు యూజర్ చార్జీల విషయం తెలుసుకునేందుకు గూగుల్‌ను సంప్రదించిన ఓ వ్యక్తి నగదు పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌లో నివాసం ఉండే కె.రాజుగౌడ్‌కు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అయితే క్రెడిట్ కార్డు యూజర్ చార్జీలు తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తుండగా ఓ వ్యక్తి రాజుగౌడ్‌కు ఫోన్ చేసి ఇండస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానంటూ.. మీ ఫోన్‌కు లింకు పంపిస్తా.. దాంట్లో మీ వివరాలు పంపండి అని చెప్పాడు.
ఇది నమ్మిన రాజుగౌడ్ అతడు చెప్పిన విధంగానే వివరాలు పంపించాడు. వెంటనే ఓటీపీ వచ్చింది. మీకు వచ్చిన ఓటీపీ నంబర్ చెబితే మీకు వివరాలు తెలుస్తాయని చెప్పడంతో రాజుగౌడ్ అదే విధంగా చేశాడు. కొద్ది సేపటి తరువాత అతడి అకౌంట్ నుంచి రూ.1,35,300 నగదు విత్‌డ్రా అయినట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: అయ్యో బిడ్డా! నువ్వు లేవనే నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావురా తండ్రి
Comments
Please login to add a commentAdd a comment