క్రెడిట్ కార్డ్స్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: నకిలీ క్రెడిట్ కార్డ్‌ల మోసాలపై తాజాగా మరోకేసు వెలుగులోకి వచ్చింది. క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టును హైదరాబాద్ అధికారులు చేధించారు. నగరంలో ఈ మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా ఎంతో కాలంగా హైదరాబాద్‌లో నకిలీ క్రెడిట్ కార్డులు సృష్టించి మోసాలకు తెగబడింది. సుమారు కోటి యాభై లక్షల రూపాయలకు పైగా సొమ్మును దండుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా పోలీసులు నిఘా వేసి నిర్ధారణకు వచ్చిన వెంటనే కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వారినుంచి నాలుగు బ్యాంకులకు చెందిన 125 నకిలీ క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇలాంటి మోసాలకి పాల్పడుతున్న వారిలో బ్యాంక్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment