Wi-Fi Network: How to Tell If Someone Is Stealing Your Wi-Fi Details Inside - Sakshi
Sakshi News home page

Wi-Fi: వైఫై ఇంటి దొంగ‌ల్ని ప‌ట్టేయండిలా!!

Published Tue, Feb 15 2022 12:57 PM | Last Updated on Tue, Feb 15 2022 3:34 PM

How to Tell If Someone Is Stealing Your Wi-Fi - Sakshi

కోవిడ్ కార‌ణంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ తో బిజీ అయ్యారా? ఈ మ‌ధ్య వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కోసం మీరు వినియోగిస్తున్న వైఫై క‌నెక్ష‌న్ మిమ్మ‌ల్ని బాగా విసిగిస్తుందా? అయితే మీ వైఫైని మీకు తెలియ‌కుండా ఎవ‌రో దొంగిలించారు. దాన్ని వినియోగిస్తున్నారు. అందుకే మీ వైఫై బాగా స్లో అయ్యింది. కాబ‌ట్టి భ‌విష్య‌త్తులో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లో వైఫై నెట్ వ‌ర్క్‌తో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం?     

వైఫైని ఎవ‌రు వినియోగిస్తున్నారో తెలుసుకోండిలా?

► మీరు క‌నెక్ట్ చేసిన రూట‌ర్ నెట్‌వ‌ర్క్ గురించి తెలుసుకోవ‌డానికి వెబ్ బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు 192.168.0.1 లేదా 192.168.1.1 లేదా 192.168.2.1 లాగిన్ అయ్యి  ఇంటర్‌ఫేస్‌ను ఓపెన్ చేయాలి. ఇవేవీ పని చేయ‌లేదంటే మీ ల్యాప్‌టాప్‌లో కమాండ్ ప్రాంప్ట్ తెరిచి, ipcofig /all అని టైప్ చేసి ఎంటర్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే  డిఫాల్ట్ గా మీ రౌటర్ అడ్ర‌స్ డిస్‌ప్లే అవుతుంది. 

► ఇక్క‌డ యూజ‌ర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంట‌ర్ చేయండి. మీ రూటర్ పాస్‌వర్డ్ మీకు తెలియక‌పోతే మీ వైఫై రూటర్‌లోని స్టిక్కర్‌లను తనిఖీ చేయండి. లేదా మీ (ISP -ఇంట‌ర్‌నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌)ను అడగండి. 

► మీరు లాగిన్ అయిన తర్వాత, మీ వైఫై క్లయింట్ లిస్ట్‌ " లేదా క‌నెక్టెడ్ డివైజ్ ఆప్ష‌న్‌ల‌ను క్లిక్ చేస్తే అక్క‌డ మీ వైఫై నెట్‌వ‌ర్క్‌ను దొంగిలించేది ఎవ‌రో తెలిసిపోతుంది. వెంటనే మీ వైఫై పాస్‌వ‌ర్డ్‌ను మార్చి సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్ తెరిచి arp -a అని టైప్ చేసి ఎంటర్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే మీ కనెక్షన్‌లను తనిఖీ చేయవచ్చు.

మీ వైఫైని సురక్షితంగా ఉంచండి

ఇప్పుడు పై అంశాల‌న్నీ పూర్తి చేసిన త‌ర్వాత ఇప్పుడు మ‌రో నాలుగు ప‌ద్ద‌తుల్ని అనుస‌రించ‌డం ద్వారా మీ వైఫై నెట్‌వ‌ర్క్‌ను మ‌రింత సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.  

WPA2 ని ఎనేబుల్ చేయండి 
వినియోగ‌దారులు యూజ‌ర్‌ పేరు, పాస్‌వర్డ్‌ని  ఎంట‌ర్ చేసిన తర్వాత మీరు యాక్సెస్ చేసిన త‌ర్వాత రూట‌ర్ కంట్రోల్ డ్యాష్ బోర్డ్‌లోకి లాగిన్ అవ్వాలి. అనంత‌రం WPA2 ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేయండి.

మీరు మీ వైఫై కనెక్షన్ కు అత్యంత సెక్యూర్  పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి. పాస్‌వ‌ర్డ్ ను రూట‌ర్ కంట్రోల్ డ్యాష్ బోర్డ్‌ను వినియోగించి మార్చుకోవ‌చ్చు. మీరు మీ పాస్ వ‌ర్డ్ మార్చితే.. మీకు తెలియ‌కుండా మీ వైఫై రూట‌ర్ ను వినియోగిస్తున్న మొబైల్స్‌, ల్యాప్ ట్యాప్‌ల‌లో మీ వైఫై నెట్ వ‌ర్క్ డీపాల్ట్ గా లాగ్ అవుట్ అవుతుంది.  

రూటర్ లాగిన్ వివరాలను మార్చండి
ఎవరైనా మీ వైఫైకి కనెక్ట్ చేయగలిగినప్పటికీ, వారు మీ వైఫై పాస్‌వర్డ్ వంటి కీలక సమాచారాన్ని మార్చలేరు కాబట్టి మీరు మీ రూటర్ లాగిన్ సమాచారాన్ని కూడా మార్చవచ్చు.

వైఫైపేరు/ఎస్ ఎస్ ఐడీని దాచండి
ఇతరులు మీ వైఫై నెట్ వ‌ర్క్‌ను స్కాన్ చేయకుండా ఉండేలా మీ వైఫై ఐడీ వివ‌రాల్ని హైడ్ చేయోచ్చు. ఒక‌వేళ మీరు ఎవ‌రికైనా వైఫై ఐడీని షేర్ చేయాల‌నుకుంటే మ్యానువ‌ల్‌గా పాస్‌వ‌ర్డ్‌ను న‌మోదు చేస్తే స‌రిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement