ఆధునిక ప్రపంచములో స్మార్ట్‌ఫోన్ వాడకం సర్వ సాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వాడే వినియోగదారులలో చాలామంది సోషల్ మీడియాలో కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే దీనికోసం మొబైల్ డేటా అవసరం. మొబైల్ డేటా లేకుండా సోషల్ మీడియా ఉపయోగించడం అసాధ్యమని అందరూ అనుకుంటారు, కానీ మొబైల్ డేటా లేకపోయినా వాట్సాప్ ఉపయోగించదానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులో ఉందన్న విషయమే మర్చిపోయి ఉంటారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.
మొబైల్ డేటా లేకుండా వాట్సాప్ ఉపయోగించలేమనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ అద్భుతమైన ఫీచర్‌ను 'ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సాప్' అంటారు. సంస్థ ఈ ఫీచర్‌ను బ్లాగ్‌లో ప్రకటించింది. దీనిని వినియోగదారులు ఎటువంటి పరిమితులు లేకుండానే వినియోగించుకోవచ్చు, కానీ భద్రతలను దృష్టిలో ఉంచుకుని మెసేజిలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశం ఉంది.
2023లో ఇంటర్నెట్ అంతరాయాలు కలిగే అవకాశం లేదు, కానీ కొన్ని దేశాల్లో అప్పుడప్పుడు ఈ సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారుల సేవలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడటానికి సంస్థ కృషి చేస్తోంది. అయితే ఈ ఫీచర్ అనవసరంగా ఉపయోగించుకోకూడదు.
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడం ఎలా?
- ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సాప్ ఫీచర్ ఉపయోగించడానికి మొదట వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి.
- స్టోరేజ్ అండ్ డేటా మీద ట్యాప్ చేసి ప్రాక్సీ ఉపయోగించుకోవచ్చు.
- ప్రాక్సీ అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత సేవ్ చేసుకోవాలి.
- మీ కనెక్షన్ విజయవంతమైతే చెక్ మార్క్ కనిపిస్తుంది.
- మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా మీరు ప్రాక్సీ ఉపయోగించి వాట్సాప్ సందేశాలు పంపించడం లేదా రిసీవ్ చేసుకోవడం వంటివి కాకుండా పోతే ప్రాక్సీ బ్లాక్ చేసి ఉండవచ్చు. అప్పుడు మరో ప్రాక్సీ చిరునామాతో మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో)
మీ వాట్సాప్ ప్రాక్సీకి కనెక్ట్ చేసే ఆప్షన్ అనేది ఆండ్రాయిడ్ & ఐఓఎస్ రెండింటిలోనూ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ఒక వేళా మీకు ఆ ఆప్షన్ కనిపించకపోతే మీ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో అందుబటులో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment