Bengaluru Man Files Complaint After Finding His Private Video With GF In Adult Sites - Sakshi
Sakshi News home page

హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంత వీడియో.. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో

Published Wed, Feb 2 2022 4:32 PM | Last Updated on Wed, Feb 2 2022 6:05 PM

Bengaluru Man Files Complaint After Finding His Private Video On Internet - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమవడంతో ఓ యువకుడు ఖంగుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు ఇటీవల ఇంటర్నెట్‌ చూస్తుండగా స్నేహితురాలితో గడిపిన వీడియో ఆశ్లీల వెబ్‌సైట్‌లో కనిపించింది. కొన్నిరోజుల క్రితం హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపాడు. అయితే వారు ఏకాంతంగా గడిపిన క్షణాలను హోటల్‌లో కొంతమంది దుండగులు రికార్డ్‌ చేశారు. 
చదవండి: ఐదేళ్లు ప్రేమాయణం, పెళ్లి చేసుకుంటానని.. వేరే యువతితో

వాటిని అతనికి తెలియకుండా వివిధ ఆశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. గత నెల 21 తేదీన ఇంటర్నెట్‌లో ఈ వీడియో కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆ వీడియోలను తొలగించాలని కోరాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 
చదవండి: ఈ ఎంటెక్‌ కుర్రాడు అపరభగీరథుడు.. స్వయంగా బావిని తవ్వి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement