పొద్దున లేనిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా.. మధ్యలో మనం చేసే దాదాపు ప్రతీ పనికి-స్మార్ట్ ఫోన్‌తో ముడిపడిపోయింది. ఎందుకంటే.. మనమంతా డిజిటల్ వరల్డ్‌లో దర్జాగా బతుకుతున్నాం. ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులూ జరగవు!. అలాంటిది ఇంటర్నెట్‌లేని రేపటిని ఊహించుకోగలమా?.. అమ్మో కలలో కూడా కష్టం అంటారా?.. అయితే ఇది చదివేయండి!
ఇంటర్నెట్ అపోకలిప్స్ internet apocalypse.. ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతూ ప్రజల్ని భయపెడుతున్న పదం. దీనర్థం ఇంటర్నెట్‌కి గడ్డుకాలం వచ్చిందని అప్రమత్తం చేయడమే!. 2025 నాటికల్లా సోలార్ మాగ్జిమమ్(ఉగ్రరూపానికి అన్నట్లు)కి సూర్యుడు చేరుకుంటాడని.. అప్పుడు ఏర్పడే సౌర తుపాన్ల ధాటికి ఇంటర్నెట్‌కు విఘాతం కలగవచ్చని తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఒకవేళ సౌర తుపాను గనుక భూమిని తాకితే!.. ఈ చర్చ ఇప్పటిది కాదు.. గత కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. సౌర తుపాను భూమిని గనుక తాకితే గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోతుంది. అంటే ఇంటర్నెట్ సహా అన్నీ సంధాన వ్యవస్థలు ఆగిపోవచ్చన్నమాట. ఆశ్చర్యకరంగా.. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరిస్తున్నారు. Internet Apocalypse 2025
ఎందుకీ అంతరాయం
సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. సమాచార వ్యవస్థకు సంబంధించిన ప్రతీదానిని దెబ్బ తీస్తుంది.
2025 ఇంటర్నెట్ Internet Apocalypse 2025 సంక్షోభాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించలేదు. కానీ, చర్చ జోరుగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా మీమ్స్ కనిపిస్తున్నాయి. మరి ఆధారం ఏమిటి?.. ఎందుకంటే స్పేస్‌సైన్స్ ఆ వాదనతో ఏకీభవిస్తోంది కాబట్టి. సోలార్ మాగ్జిమమ్ ప్రభావం ఇంటర్నెట్‌పై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితులకు ముందుగా సన్నద్ధం కావాలంటూ ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు.
సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1859లో టెలిగ్రాఫ్స్ సేవలు దెబ్బ తిన్నాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉండొచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంగీత అబు జ్యోతి చెబుతున్నారు.
నష్టం ఊహించని దానికంటే..
Internet Apocalypse 2025 సంభవిస్తే గనుక సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది?.. తిరిగి ఎన్నిరోజుల్లో యధాస్థితికి తీసుకురావొచ్చనేది ఇప్పుడే చెప్పలేం. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం ఎలా ఎదుర్కొంటుందో కూడా ఊహించలేం. కానీ, జరిగే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పొచ్చు.
ఒకవేళ నిజంగా సౌరతుపాను Internet Apocalypse 2025 గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుంది.
Comments
Please login to add a commentAdd a comment