ఎన్‌ఎస్‌యూఐ చీఫ్ ఫిరోజ్ ఖాన్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ తన పదవి నుంచి వైదొలిగారు. ఫిరోజ్ ఖాన్ రాజీనామాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆమోదించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్ సోమవారం తన పదవికి రాజీనామా చేయగా, పార్టీ చీఫ్ రాహుల్ ఆమోద ముద్ర వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్‌ఎస్‌యూఐ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మీదట ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కాగా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వద్ద తాను పనిచేసే సమయంలో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని చత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆయనపై పార్లమెంట్ స్ర్టీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ఫిరోజ్ ఖాన్ నుంచి ప్రాణ హాని ఉందని ఆమె ఆరోపించారు.కాగా, దేశవ్యాప్తంగా మహిళలు తమపై సెలబ్రిటీల లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తుండటంతో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో దుమారం రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment