NSUI Student Wing
-
చావటానికైనా సిద్ధం.. ఇక్కడి నుంచి కదలం: ఆందోళనకారులు
-
ఈ విద్యార్ధి మాటలకు వెనుదిరిగి వెళ్లిపోయిన అధికారులు
-
చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు
-
Secunderabad Protests: చర్చలకు పిలిచిన పోలీసులు
-
చావడానికైనా సిద్ధం..!!
-
Secunderabad Railway Station: రైల్వేస్టేషన్ వదిలి వెళ్లిపోండి.. లేదంటే మరోసారి కాల్పులు
-
సికింద్రాబాద్ ఆందోళనకారులపై పోలీస్ ఫైరింగ్
-
కన్నెర్ర చేసిన విద్యార్థులు.. అగ్నిపథ్ గందరగోళం
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు
-
కాంగ్రెస్‌కు మీటూ సెగలు : ఎన్ఎస్యూఐ చీఫ్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ తన పదవి నుంచి వైదొలిగారు. ఫిరోజ్ ఖాన్ రాజీనామాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆమోదించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్ సోమవారం తన పదవికి రాజీనామా చేయగా, పార్టీ చీఫ్ రాహుల్ ఆమోద ముద్ర వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్యూఐ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మీదట ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కాగా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వద్ద తాను పనిచేసే సమయంలో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని చత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆయనపై పార్లమెంట్ స్ర్టీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ఫిరోజ్ ఖాన్ నుంచి ప్రాణ హాని ఉందని ఆమె ఆరోపించారు.కాగా, దేశవ్యాప్తంగా మహిళలు తమపై సెలబ్రిటీల లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తుండటంతో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో దుమారం రేగుతోంది. -
బాబా రాందేవ్‌ను అరెస్టు చెయ్యాలి
ఠాణే: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నవీముంబైలో కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రాందేవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నవీముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు దశరత్ భగత్ మాట్లాడుతూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం సభ్యులు కూడా పాల్గొన్నారు. ఠాణే జిల్లా ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడు రాహుల్ త్రైంబకే, ప్రధాన కార్యదర్శి మనోజ్ మహారాణలు మాట్లాడుతూ... బాబా రాందేవ్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, దళితులను అవమానపర్చేలా మాట్లాడుతున్నారని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.