సన్నీకి తప్పిన ప్రమాదం.. | Sunny Leone's plane almost crashed | Sakshi
Sakshi News home page

సన్నీకి తప్పిన ప్రమాదం..

May 31 2017 10:29 PM | Updated on Sep 5 2017 12:28 PM

సన్నీకి తప్పిన ప్రమాదం..

సన్నీకి తప్పిన ప్రమాదం..

బాలీవుడ్ నటి సన్నీలియోన్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.

ముంబై:
బాలీవుడ్ నటి సన్నీలియోన్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్‌, మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జాగ్రత్తగా మారుమూల ప్రాంతంలో దింపేశాడు.

విమానం ప్రమాదానికి గురైనప్పుడు తాను అనుభవించిన భయానక క్షణాలను వివరిస్తూ సన్నీ లియోన్ ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మేము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు! వాతావరణం అనుకూలించని కారణంగా మా ప్రైవేటు విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఇంటికి వెళుతున్నాము.. థ్యాంక్స్ యూ గాడ్‌ అని సన్ని ట్వీట్‌ చేశారు. పైలట్స్‌ అద్భుతమైన నైపుణ్యం కలవారని, తమ జీవితాలను కాపాడారని సన్ని చెప్పారు. సన్నీ ప్రాణాలతో బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement