కుప్పకూలిన విమానం..నలుగురి మృతి
కాలి ఫోర్నియా: అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. సోమవారం కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ లో సోమవారం ఒక నివాస ప్రాంతం లోకి కూలిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా విమానం కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకోవడంతో , ఆప్రాంతమంతా దట్ట మైన పొగవ్యాపించిందనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈశాన్య రివర్సైడ్ మున్సిపల్ విమానాశ్రయంనుంచి బయలుదేరిన చిన్న విమానం సెస్నా 310 నివాసం ప్రాంతంపై కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఇయాన్ గ్రెగర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో రెండు గృహాలు మంటల్లో చిక్కుకున్నాయని ఫైర్ చీఫ్ మైఖేల్ మూర్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురితో బయలుదేరిన విమానం సాన్‌జోస్ కు తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా నివాసప్రాంతాల్లోకి దూసుకొచ్చి కుప్పకూలడంతో మంటలు వ్యాపించాయి. వీరిలో ఇద్దరు పెద్దవాళ్లు, ముగ్గురు టీనేజర్లు ఉన్నట్టు సమాచారం. ఓ యువతి సహా ఇద్దరిని రక్షించిన పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయినవారు, విమానంలోనివారా, లేక స్థానికులా అనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు. దాదాపు 30 మంది స్తానికులను అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి కు తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.