
శంషాబాద్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర అస్వస్థతతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే372 విమానం దుబాయి నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. మార్గంమధ్యలో సూడాన్‌కు చెందిన మహ్మద్ అలీ(55) అనే ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం అతన్ని విమానాశ్రయ ప్రాంగ ణంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అలీ విమానంలోనే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. సుమారు మూడు గంటల తర్వాత విమానం తిరిగి బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment