
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) విశాఖపట్నం నుంచి రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ చంద్రమోహన్ బిసా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాశ్మీర్‌హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర (3రాత్రులు, 4పగళ్లు) సాగే యాత్ర జూలై 29వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై, ఆగష్టు 1వ తేదీన విశాఖపట్నంలోనే ముగుస్తుంది.
మెస్మరైజింగ్ కేరళ (5రాత్రులు, 6పగళ్లు) ఉండే యాత్ర ఆగష్టు 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై ఆగష్టు 15వ తేదీన విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్, ఎకానమి క్లాస్‌లో విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద గల ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, చందన్‌కుమార్– 82879 32318, గణనాథ్ 82879 32281నంబర్లలో సంప్రదించాలని చంద్రమోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment