Packages
-
ఐఐటీల ప్లేస్‌మెంట్స్.. వివరాలు గప్ చుప్
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)(IIT)లు. ఇంజనీరింగ్ విద్య అనగానే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మొదట గుర్తుకొచ్చేవి ఇవే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించి ఐఐటీలో సీటు సాధిస్తే జాక్‌పాట్ కొట్టినట్టేనని విద్యార్థులు భావిస్తారు. బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందాలన్నా, అత్యుత్తమ వార్షిక వేతన ప్యాకేజీలు దక్కాలన్నా అది ఐఐటీలతో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా ఉంది.ఈ నేపథ్యంలో ఏటా జరిగే ఆయా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్(Placements)పై అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం ఇంజనీరింగ్ ఔత్సాహికులే కాకుండా మిగతా వారు కూడా ఏ స్థాయిలో ఐఐటీల విద్యార్థులు వేతన ప్యాకేజీలు దక్కించుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి ఎక్కువ ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో గోప్యత పాటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలు వెల్లడించింది కొన్ని ఐఐటీలే ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్ 1నే ఆయా ఐఐటీల్లో ఆన్ క్యాంపస్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు ఏ స్థాయిలో వేతన ప్యాకేజీలు లభించాయో ఇప్పటివరకు కొన్ని ఐఐటీలు మాత్రమే బయటకు సమాచారాన్ని వెల్లడించాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూరీ్క, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ–బీహెచ్‌యూ ఈ కోవలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఐఐటీలన్నీ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. కారణాలు ఇవేనా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి బయటకు సమాచారాన్ని వెల్లడించకపోవడానికి కారణం ఉందని ఐఐటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారి సంక్షేమం కోసమే తాము ప్లేస్‌మెంట్స్ సమాచారాన్ని వెల్లడించడం లేదని అంటున్నారు. వేతన ప్యాకేజీల గురించి ఒకరితో మరొకరు పోల్చుకోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం çపడుతోందని.. అందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన అన్న ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఉద్యోగ నియామక వివరాలు, వేతన ప్యాకేజీల వివరాలు వెల్లడించవద్దని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి. వారం లేదా పక్షం రోజులకోసారి.. సాధారణంగా దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో రెండు దశల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. డిసెంబర్లో మొదటి దశ, జనవరి – జూన్ మధ్య రెండో దశ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించినవారి సమాచారాన్ని రోజువారీ కాకుండా వారానికోసారి లేదా 15 రోజులకోసారి విడుదల చేయాలని ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీల సమావేశంలో ఆయా సంస్థలు ప్రతిపాదించాయి. ప్లేస్‌మెంట్స్ గురించి మీడియాలో వచ్చే వార్తలు విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలన్నదే తమ ఏఐపీసీ కన్వీనర్ ప్రొఫెసర్ కౌశిక్ పాల్ తెలిపారు. కొత్త ఐఐటీల ప్లేస్‌మెంట్స్ నివేదికలు అప్పుడే.. చాలా ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన కంపెనీల పేర్లు, అత్యధిక, మధ్యస్థ ప్యాకేజీలు, ఆఫర్‌ను పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య, వాటిలో అంతర్జాతీయ ఆఫర్ల సంఖ్య వంటివాటి గురించి రోజూ సమాచారమిచ్చేవి. అయితే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధార్వాడ్, మరికొన్ని కొత్త ఐఐటీలు 2024–25 సెషన్లో ప్లేస్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో ఒకేసారి తుది ప్లేస్మెంట్ నివేదికను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఐఐటీల నిర్ణయానికి మద్దతు విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీల వివరాలను బహిర్గతం చేయకూడదనే నిర్ణయానికి పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ప్లేస్మెంట్లు, మంచి ప్యాకేజీలు పొందిన విద్యార్థుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తే ఇవి.. ప్లేస్మెంట్ దక్కనివారు, మంచి పే ప్యాకేజీలు పొందనివారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐఐటీ ధన్బాద్లో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సౌమ్యా సింగ్ అన్నారు. విద్యార్థులు ఏమంటున్నారంటే.. మొదటి ప్రయత్నంలో మంచి ప్లేస్మెంట్ దక్కకపోతే నిరుత్సాహం చెందాల్సిన అవసరంలేదని ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రిత్విక్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఐటీయన్లపై మీడియా నివేదికలు ఒత్తిడి పెంచలేవన్నాడు. ఆందోళన చెందకుండా ఇతర పరీక్షలు, ఇంటర్వ్యూలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.ప్రొఫెసర్లు, విద్యార్థుల మద్దతు.. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ప్లేస్మెంట్లు, ప్యాకేజీల గురించి ఏ ఐఐటీ మీడియాకు వెల్లడించకూడదని ఏఐపీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఐఐటీల ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఐఐటీల నిర్ణయం ఆందోళన తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లేస్మెంట్లు, ప్యాకేజీల వివరాలు మీడియాలో రాకపోవడం మంచిదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు అభిప్రాయపడ్డారు.లేదంటే తమ ఇంటి ఇరుగుపొరుగువారు తన గురించి తన తల్లిదండ్రులను ఆరా తీస్తారని.. ఇది వారిపై అనవసర ఆందోళన పెంచుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యార్థులతో తనను పోల్చుతారని.. ఇది కూడా తన తల్లిదండ్రులను ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్మెంట్లు, ప్యాకేజీ వివరాలను బహిరంగంగా వెల్లడించవద్దని ఐఐటీలు మంచి నిర్ణయమే తీసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మన పార్టీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఈసారి ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా ? లేదా అన్న చర్చ బీజేపీలో సాగుతోంది. కర్ణాటకలో మాదిరి తెలంగాణలోనూ ఒక్కో కుటుంబంలోని ఇద్దరికి టికెట్లు కేటాయిస్తారా అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక్కడా ఆశావహులు ఉన్నారు.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్యారెడ్డి, ఈటల రాజేందర్, ఆయన భార్య ఈటల జమున, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆయన భార్య, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి, డీకే అరుణ, ఆమె కుమార్తె, ఇలా బీజేపీలో కూడా ఓ కుటుంబంలో రెండేసి టికెట్ల కోసం ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టు చర్చ జరుగుతోందట..ఇదంతా నిజమవుతుందా? లేక ప్రచారానికే పరిమితమా చూడాలి. చదవండి: లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో? -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత ఇప్పుడూ కీవ్ రాయబార కార్యాలయాలకు జంతువులు కళ్లు, నెత్తుటితో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను పంపుతోంది రష్యా. ఈ మేరకు హంగేరి, నెదర్లాండ్స్, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని కీవ్ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన బ్లడ్ ప్యాకేజీలను రష్యా పంపినట్లు సమాచారం. అదీగాక వాటికన్లోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం తలుపులను ధ్వసం చేసి అక్కడ మానవ మలం వదిలి వేసినట్లు ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే కజకిస్తాన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ఎప్పుడూ సదా అప్రమత్తంగానే ఉంటుంది. అలాగే ఈ రాయబార కార్యాలయాలు సదా ఉక్రెయిన్ గెలుపు కోసం సమర్థవంతంగా పని చేస్తూనే ఉంటాయి అని నొక్కి చెప్పారు. ఐతే రష్యా రాయబార కార్యాలయాలు ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. -
ఈయూ ఆంక్షల మోత...టెన్షన్లో రష్యా!
EU said it will look into sanction regime on gold: ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధంకు దిగడంతో ఈయూ దేశాలు ఇప్పటికే రష్యా పై ఆంక్షలు మోత మోగించింది. అయినా రష్యా దూకుడు మాత్రం ఆగలేదు. పైగా ఉక్రెయిన్ పై మరిన్ని యుద్ధ నేరాలకు పాల్పడింది రష్యా. అంతేకాదు ఉక్రెయిన్ స్వాధీన దిశగా దాడులు వేగవంతం చేసింది కూడా. దీంతో రష్యాను నియంత్రించేలా మరిన్ని ఆంక్షలను విధించే దిశగా ఈయూ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈయూ రష్యా ఎగుమతులకు సంబంధించిన ముఖ్యమైన వాటిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు రష్యా బంగారం ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు ఈయూ కమిషన్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఈయూ రష్యా పై ఆరు ఆంక్షల ప్యాకేజిని విధించింది. ఈ మేరకు ఈయూ రష్యాకి సంబంధించి ఎగుమతులలో ముఖ్యమైనది అయిన బంగారం పై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ హెడ్ మారోస్ సెఫ్కోవిక్ తెలిపారు. తాము సభ్యదేశాల స్థాయిలో ఒప్పందానికి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అదీగాక ఉక్రెయిన్ ఉప ప్రధాని ఓల్గా స్టెఫనిషినా కూడా రష్యా పై కొత్త ఆంక్షల ప్యాకేజిని ఆమోదించాలని కోరారు. అయినా ఇప్పటివరకు ఇన్ని ఆంక్షలు విధించినా రష్యాలో ఏ మాత్రం మార్పు రాలేదని, పైగా తాను చేసి దురాగతాలకు జవాబుదారీగా భావించేలా కూడా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు విధించనున్న ఆంక్షలు రష్యాని గట్టిగా నియంత్రించగలదని ఆశిస్తున్నానని, సాధ్యమైనంత త్వరితగతిన ఈ ఆంక్షలు ఆమోదించాలని కోరుకుంటున్నానని అన్నారు. (చదవండి: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధాజ్ఞలు) -
ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన ప్యాకేజీలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విశాఖపట్నం నుంచి రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ చంద్రమోహన్ బిసా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాశ్మీర్‌హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర (3రాత్రులు, 4పగళ్లు) సాగే యాత్ర జూలై 29వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై, ఆగష్టు 1వ తేదీన విశాఖపట్నంలోనే ముగుస్తుంది. మెస్మరైజింగ్ కేరళ (5రాత్రులు, 6పగళ్లు) ఉండే యాత్ర ఆగష్టు 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై ఆగష్టు 15వ తేదీన విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్, ఎకానమి క్లాస్‌లో విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, చందన్‌కుమార్– 82879 32318, గణనాథ్ 82879 32281నంబర్లలో సంప్రదించాలని చంద్రమోహన్ తెలిపారు. -
దోపిడికి గురవుతున్న సరకు రవాణా రైళ్లు... గుట్టలుగా పడి ఉన్న ఆన్లైన్ ప్యాకేజ్ కవర్లు
Thieves Raid Amazon, FedEx Train Cargo: ఇంతవరకు మనదేశంలో రైళ్లలో దొంగతనాలు గురించి ఉంటాం. అయితే లాంగ్ జర్నీ చేసే రైళ్లలో కచ్చితంగా దొంగతనాలు జరుగుతుండటం గురించి విన్నాం. మనం ఆన్లైన్లో ఆర్డర్‌చేసే వస్తువలను తీసుకువచ్చే గూడ్స్ రైళ్లపై దొంగలు దాడి చేసి పట్టుకుపోవడం గురించి విని ఉండం. పైగా సరకు కవర్లు కూడా అక్కడే పట్టాలపై గుట్టలు గుట్టలుగా పడేసి వెళ్లిపోతున్నారట. అసలు విషయంలోకెళ్తే...లాస్ ఏంజిల్స్‌లోని సరకులు రవాణ చేసే రైళ్లపై దొంగలు దాడి చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రైళ్లు ఆగే ప్రదేశం కోసం వేచి చూసి డజన్లకొద్ది ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఉత్పత్తులను ఎత్తుకుపోతారు. అంతేకాదు రైల్వే కంటైనర్ల పై దాడి చేసి కోవిడ్-19 టెస్ట్ కిట్లు, ఫర్నీచర్ లేదా మందులు వంటివి చాల ఎత్తుకుపోయారు. ఈ మేరకు శుక్రవారం సిటీ సెంటర్‌కి సమీపంలో ఉన్న పట్టాలపై కొన్ని వేల ఆన్లైన్ ప్యాకేజ్‌లు పడి ఉండటాన్ని చూస్తే సమీపంలోని వీధుల నుంచి చాలా సులభంగా రైల్వే కంటైనర్ల వద్దకు చేరకోగలుగుతున్నారని చెప్పవచ్చు ఈ దొంతనాలు గతేడాది యూఎస్‌లో డిసెంబర్ నాటికి సుమారు 160% కి చేరితే ఈ ఏడేది ఆ సంఖ్య కాస్త 356%కి చేరింది. ఈ దొంగల ముఠా దెబ్బకు ప్రముఖ ఆన్‌లైన వ్యాపార సంస్థలైన అమెజాన్, టార్డెట్, యూపీఎస్, ఫెడ్ఎక్స్ వంటి కంపెనీలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే ఈ దొంగతనాలను అడ్డుకట్టవేయడానికి డ్రోన్లు ఇతర డిటెక్షన్ సిస్టమ్‌లతో సహా -- నిఘా చర్యలను బలోపేతం చేసినట్లు లాస్ఏంజెల్స్లోని యూనియన్ పసిఫిక్ తెలిపింది . పైగా మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. అయితే ఆ దొంగలను పట్టుకున్న తర్వాత కోర్టు చిన్న నేరంగా పరిగణించి ఓ మోస్తారు జరిమాన విధించి వదిలేయడంతో వాళ్లు 24 గంటల్లో విడుదలైపోతున్నారని యూనియన్ పసిఫిక్ వాపోయింది. పైగా వారు ఈ దోపిడి దాడులు నిర్వహించేటప్పుడు విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై దాడులు చేయడం లేదా నిప్పంటించడం వంటి విధ్వంసకర పనులకు తెగబడతున్నారని తెలిపింది. ఈ దొంగతనాలు కారణంగా గతేడాది దాదాపు రూ 36 కోట్ల నష్టం వాటల్లిందని పేర్కొంది. ఈ విషయమై యూనియన్ పసిఫిక్ లాస్ ఏంజెల్స్ కౌంటీ అటార్నీ కార్యాలయానికి లేఖ రాయడమే కాక గతేడాది అవలంభించిన భద్రతా విధానాన్ని మళ్లీ పునం పరిశీలించమని కోరింది. (చదవండి: కరోనాకు 'కత్తెర'.. రెండు కొత్త చికిత్సా విధానాలు ఆమోదం) -
Netflix: నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్! ఐదేళ్ల తర్వాత..
Netflix India cuts prices across its streaming plans: భారత్‌లో యూజర్ల కోసం సబ్ స్క్రిప్షన్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్‌ను సవరిస్తూ.. తక్కువ ధరకే ప్యాకేజీలను అందించబోతోంది. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య రేస్ రసవత్తరంగా మారనుంది. 199 రూపాయల బేసిక్ ప్లాన్‌ను.. కేవలం రూ. 149కే అందించనున్నట్లు ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. అంతేకాదు మిగతా ప్యాకేజీలకు సైతం సవరణలు ఇచ్చింది. 2016లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అడుగుపెట్టగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత సబ్ స్క్రిప్షన్ ప్లాకేజీ రేట్లను తగ్గించడం విశేషం. మరోవైపు అమెజాన్ ప్రైమ్ 149రూ. ప్లాన్‌ను.. 199కి పెంచిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ అదే మంత్లీ ప్లాన్‌ను 50రూ. మేర తగ్గించడం విశేషం. ►మొబైల్ ప్లాన్‌లో భాగంగా.. 149రూ. సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లో సింగిల్ మొబైల్ ఫోన్, ట్యాబ్‌లలో 480p(852×480 pixels) రెజల్యూషన్‌తో వీడియోలను వీక్షించొచ్చు. ►ఇక బేసిక్ ప్లాన్‌లో 199రూ. సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లో సింగిల్ మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీలలో ఒకేసారి చూడొచ్చు. ఇంతకు ముందు ఈ ఆఫ్షన్ 499రూ. ఉండేది. ►స్టాండర్డ్ ప్లాన్ 1080p క్వాలిటీతో 499రూ. (ఒకేసారి రెండు వేర్వేరు డివైజ్‌ల్లో సైతం వీక్షించొచ్చు), .. ఇది ఇంతకు 649రూ. ప్లాన్‌లో అందించింది నెట్‌ఫ్లిక్స్. ►ప్రీమియం ప్లాన్‌లో బెస్ట్ 4కే ఫ్లస్ హెడ్‌డీఆర్ క్వాలిటీ కోసం 649రూ. ప్యాకేజీలు ఉన్నాయి. ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి నాలుగు వేర్వేరు డివైజ్‌లలో వీక్షించొచ్చు. Aap @aliaa08 se convince ho gaye ya hum aur bole? 👀#HappyNewPrices are here, which means you can now watch Netflix on any device at ₹199 and on your mobile at ₹149! pic.twitter.com/zdHrPlTJhi — Netflix India (@NetflixIndia) December 14, 2021 ఇప్పటికే ఉన్న యూజర్లకు అప్‌గ్రేడ్ ఫీచర్‌ను ఇవాళ్టి(మంగళవారం, డిసెంబర్ 14 2021) అందించనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు, మీరు బేసిక్ ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉంటే, మీరు అప్‌గ్రేడ్‌ను తిరస్కరించవచ్చు మరియు కొత్త ప్లాన్‌ను తగ్గింపు ధరలకు పొందవచ్చు. క్వాలిటీ స్ట్రీమింగ్ సర్వీస్ ఓటీటీగా పేరున్న నెట్‌ఫ్లిక్స్.. అధిక ప్యాకేజీల పట్ల ఇంతకాలం యూజర్లలో అసంతృప్తి ఉండేది. అయితే తాజా నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరికొందరు యూజర్లు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక సరిగ్గా అమెజాన్ ధరల పెంచిన టైంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. చదవండి: నెట్‌ప్లిక్స్ వినియోగిస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే..! -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. వార్షిక వేతనాల్లో కోత
క్యాంపస్ ప్లేస్మెంట్లకు అడ్డా అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో వార్షిక వేతనాలు దక్కించుకున్న విద్యార్థులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దేశంలో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ వచ్చి చేరే క్యాంపస్‌లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇక్కడికి వస్తుంటాయి. విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉండగానే లక్షల జీతాలు చెల్లించి తమ సంస్థలో చేర్చుకుంటామంటూ ఆఫర్ లెటర్లు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది ఇదే అధికం ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ విద్యార్థి సోమ్నాథ్పాల్ అత్యధిక వార్షిక వేతనం దక్కించుకున్న విద్యార్థిగా నిలిచారు, ఒక మల్టీ నేషనల్ కంపెనీ రూ. 17 లక్షల వార్షిక వేతనం చెల్లించే ఒప్పందం మీద సోమ్‌నాథ్‌కి అవకాశం పొందారు. అంతకు ముందు ఏడాది అత్యధిక వార్షిక వేతనం రూ. 43 లక్షలు ఉండగా కోవిడ్‌కి ముందు ఏడాది ఈ మొత్తం రూ. 45 లక్షలుగా నమోదు అయ్యింది. రూ. 20 లక్షల తేడా కోవిడ్ కారణంగా కంపెనీలు ఎక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఏడాది వ్యవధిలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట అత్యధిక వార్షిక వేతనాల్లో ఏకంగా 20 లక్షల వరకు తగ్గిపోయింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సగటు వేతనం రూ. 8 నుంచి 10 లక్షల మధ్య ఉంటుండగా ఇప్పుడు అది రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పడిపోయిందని వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రేరణ తెలిపారు. ఈ కోర్సులకే ప్రాముఖ్యత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వస్తున్న కంపెనీలు ఎక్కువగా డేటా ఎనలటిక్స్, బిజినెస్ ఎనలటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందారు. చదవండి : రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ! -
మరో 23 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో.. దేశంలో వైద్య రంగంలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చడం కోసం రూ. 23,123 కోట్లను సమకూర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు కూడా రుణ సాయం పొందే వీలు కల్పిస్తూ తెచ్చిన పలు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కొత్త మంత్రి మండలి కొలువుదీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వైద్య రంగంలో మౌలిక వసతులకు సంబంధించిన ఈ ఆర్థిక ప్యాకేజీని వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు అమలు చేస్తామని కేబినెట్ భేటీ అనంతరం మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు, హెల్త్ సెంటర్ల ఏర్పాటు కోసం కేంద్రం గతంలో రూ. 15 వేల కోట్లను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజా ప్యాకేజీని రెండో విడతగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ నిధుల్లో కేంద్రం దాదాపు రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8 వేల కోట్లను సమకూరుస్తాయి. దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రైమరీ, జిల్లా స్థాయిల్లో వైద్య వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇందులో భాగంగా, 2.4 లక్షల సాధారణ బెడ్స్‌ను, 20 వేల ఐసీయూ బెడ్స్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం బెడ్స్‌లో 20 శాతం పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో మెడికల్ ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కరోనా నియంత్రణ, కోవిడ్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. కోవిడ్ నుంచి పిల్లలను రక్షించడం, సంబంధిత మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ యూనిట్స్‌ను, ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో పిల్లల కోసం ‘పీడియాట్రిక్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ కమిటీలకు రుణ సదుపాయం లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నుంచి రుణాలు పొందేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మార్కెట్ల సామర్ధ్య పెంపునకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. మార్కెట్ కమిటీలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ నిధులు ఉపయోగపడ్తాయన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ కమిటీలు మూతపడ్తాయన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ‘గత ఏడాది ప్రధాన మంత్రి రూ. లక్ష కోట్ల మేర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రకటించారు. ఇది ఏపీఎంసీకి కూడా వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు. ఈ దిశగా చేసిన పలు మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని వివరించారు. ఏపీఎంసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, జాతీయ, రాష్ట్ర సహకార సమాఖ్యలు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా వీటిని వాడుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ. 2 కోట్ల వరకు రుణం లభిస్తుంది. దీనిపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలైతే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ని యూనిట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రయివేటు సంస్థలైతే గరిష్టంగా 25 యూనిట్లకు మాత్రమే ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఏపీఏంసీలు తమ మార్కెట్ యార్డ్ పరిధిలో కోల్డ్ స్టోరేజ్, సార్టింగ్, గ్రేడింగ్ తదితర విభిన్న రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుకు రూ. 2 కోట్ల రుణం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. కొబ్బరి బోర్డులో ఏపీ, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం–1979లో సవరణలు చేస్తూ వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఛైర్మన్ పోస్టును నాన్ ఎగ్జిక్యూటిక్ పోస్టుగా మార్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ మార్పు ద్వారా అర్థం చేసుకునే వీలుంటుందని, ఈ నిర్ణయం కొబ్బరి రైతులకు మేలు చేస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అలాగే బోర్డులో కేంద్రం నామినేట్ చేసే సభ్యుల్లో నాలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉందని, దీనిని ఆరుగురికి పెంచామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రి తెలిపారు. కేంద్రం దాదాపు రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8 వేల కోట్లను సమకూరుస్తాయి. దేశవ్యాప్తం గా 736 జిల్లాల్లో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రైమరీ, జిల్లా స్థాయిల్లో వైద్య వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇందులో భాగంగా, 2.4 లక్షల సాధారణ బెడ్స్‌ను, 20 వేల ఐసీయూ బెడ్స్ ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం బెడ్స్‌లో 20% పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో మెడికల్ ఆక్సిజన్‌ను నిల్వ చేసేం దుకు స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కరోనా నియంత్రణ, కోవిడ్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. కోవిడ్ నుంచి పిల్లలను రక్షించడం, సంబంధిత మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ యూని ట్స్‌ను, ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో పిల్లల కోసం ‘పీడియాట్రిక్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ కమిటీలకు రుణ సదుపాయం లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నుంచి రుణాలు పొందేందుకు వ్యవసాయ మార్కెట్ కమి టీలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మార్కెట్ల సామర్థ్య పెంపునకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. మార్కెట్ కమిటీలు మరింత బలోపేతమయ్యేం దుకు ఈ నిధులు ఉపయోగపడ్తాయన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ కమిటీలు మూతపడ్తాయన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ‘గత ఏడాది ప్రధాన మంత్రి రూ. లక్ష కోట్ల మేర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రకటించారు. ఇది ఏపీఎంసీకి కూడా వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు. ఈ దిశగా చేసిన పలు మార్పులకు కేబి నెట్ ఆమోదం తెలిపింది’ అని వివరించారు. ఏపీఎంసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, జాతీయ, రాష్ట్ర సహకార సమాఖ్యలు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా వీటిని వాడుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ. 2 కోట్ల వరకు రుణం లభిస్తుంది. దీనిపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలైతే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ని యూనిట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రైవేటు సంస్థలైతే గరిష్టంగా 25 యూనిట్లకు మాత్రమే ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఏపీఏంసీలు తమ మార్కెట్ యార్డ్ పరిధిలో కోల్డ్ స్టోరేజ్, సార్టింగ్, గ్రేడింగ్ తదితర విభిన్న రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుకు రూ. 2 కోట్ల రుణం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. కొబ్బరి బోర్డులో ఏపీ, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం–1979లో సవరణ లు చేస్తూ వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఛైర్మన్ పోస్టును నాన్ ఎగ్జిక్యూటిక్ పోస్టుగా మార్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ మార్పు ద్వారా అర్థం చేసుకునే వీలుంటుందని, ఈ నిర్ణ యం కొబ్బరి రైతులకు మేలు చేస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అలాగే బోర్డులో కేంద్రం నామినేట్ చేసే సభ్యుల్లో 4 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉందని, దీనిని 6కు పెంచామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రి తెలిపారు. ముఖ్యమైన నిర్ణయాలు: మోదీ రైతుల సంక్షేమం కోసం కొన్ని ముఖ్య మైన నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఇకపై వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించవచ్చన్నారు. కోవిడ్–19 ప్యాకేజ్‌తో చిన్న పిల్లల కరోనా చికిత్సకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నామన్నారు. జిల్లా స్థాయిలో పీడియాట్రిక్ కేర్ యూనిట్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ స్టోరేజ్, అంబులెన్స్, ఔషధాల అందుబాటు.. మొదలైన సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రధాని పలు వరుస ట్వీట్లు చేశారు. -
లెక్క పెద్దది... ఉద్దీపన చిన్నది
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం – ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ఇది ప్రాథమికం. ఒకప్పటి ప్రభువులైనా, ఇప్పటి ప్రభుత్వాలైనా తప్పక చేయాల్సిన పని ఇదే. కరోనా కష్టకాలం ఆ సంగతి పదే పదే గుర్తుచేస్తోంది. అందుకే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా రూ. 6.28 లక్షల కోట్ల అంకెతో ముందుకు రావడం కాస్తంత సంతోషమే. ఇప్పటికే కరోనా మొదటి ఉద్ధృతిలో, తరువాత ఒకటికి, మూడుసార్లు రకరకాల ఉద్దీపన ప్యాకేజీలు, ఉపశమన చర్యలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి ఇలా ముందుకు వచ్చింది. దెబ్బతిన్న అనేక రంగాలకు అండగా నిలవడం కోసం తాజా కరోనా రెండో ఉద్ధృతి అనంతరం తొలిసారిగా చర్యలు ప్రకటించింది. ఆర్థికరంగం అప్పుడప్పుడే కోలుకుంటోందని భావిస్తున్న వేళ కరోనా సెకండ్ వేవ్ నిజానికి పెద్ద దెబ్బే కొట్టింది. అంతకు మించి అనిశ్చితి నెలకొనేలా చేసింది. అందుకే, ఆర్థికమద్దతు అందించాలంటూ ‘రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధాన సంఘం’తో సహా పలువురు ప్రభుత్వాన్ని కోరారు. ఆ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఎనిమిది కీలక చర్యలతో తాజా ఉద్దీపన ప్యాకేజీ వచ్చింది. అయితే, ఇందులో నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేదేమీ లేదు. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణసంస్థలకు ప్రభుత్వహామీగానే ప్యాకేజీలో ఎక్కువ ఉండనుంది. నిజానికి, కరోనాతో గత ఏడాది మార్చిలో తొలిసారి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన రెండు రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులనూ, పట్టణ, గ్రామీణ నిరుపేద ప్రజానీకాన్నీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రకటన అది. ఆ తరువాత నుంచి ‘ఆత్మనిర్భర్ ప్యాకేజీ’ లాంటి రక రకాల పేర్లతో కేంద్రం నుంచి వివిధ సందర్భాల్లో ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలు వస్తూ వచ్చాయి. వాటి పేర్లు, ఉద్దేశాలు ఏమైనప్పటికీ – కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికంటూ లక్షల కోట్లు లెక్కల్లో కనిపించాయి. తాజా ఉపశమన చర్యలూ దానికి కొనసాగింపే! కరోనాతో దెబ్బ తిన్న రంగాలకు కొత్తగా రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం ప్రకటించారు. ఇందులో భాగంగా కరోనా మూడో వేవ్ ముప్పు నేపథ్యంలో– ఆరోగ్య రంగం మీద, అందులోనూ ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి పెట్టడం విశేషం. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు ‘నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్’ హామీ ఇవ్వనుంది. కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ పట్ల, జనం ఇబ్బందుల పట్ల ఈ మాత్రం అక్కర కచ్చితంగా హర్షణీయం. కానీ, ఆలోచనలో ఉన్నది ఆచరణలో ఎంత ప్రతిఫలిస్తుందన్నది పలువురి సందేహం. అందుకు తగ్గట్టే... విత్తమంత్రి తాజా అంకెల విన్యాసంలో కూడా నిజంగా అందేదెంత, జనం లబ్ధి పొందేదెంత అన్నది కాస్తంత లోతుగా పరి శీలిస్తే కానీ తేలవు. మొత్తం రూ. 6.28 లక్షల కోట్లలో అనేకం– బ్యాంకులు అప్పులివ్వాల్సిన రుణ హామీ పథకాలు, లేదంటే ఇప్పటికే బడ్జెట్లో చూపిన వ్యయాలు. అలాగే, ఇందులో చాలా మటుకు ఈ సంవత్సరానికి సంబంధించినవి కావు. అయిదేళ్ళ పాటు సాగే అనేక సంస్కరణల్లో అవి భాగం అనేది గమనార్హం. ఇక, ఈ ప్రకటించిన మొత్తంలో కేవలం పదో వంతే (దాదాపు రూ. 55 వేల నుంచి 60 వేల కోట్లు) ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే అదనపు వ్యయం అని ఆర్థిక నిపుణుల అంచనా. ఇక, మరికొన్నేమో ప్రస్తుతం ఉన్న పథకాలు, గతంలో ప్రకటించిన చర్యల్లోనే చేసిన మార్పులు చేర్పులు. ప్రభుత్వ అండతో వచ్చిన గ్యారెంటీలను చూసి, బ్యాంకులు మరింత రుణాలివ్వడానికి ముందుకు వస్తాయనే ఊహ మీదే ఈ ప్యాకేజీ రూపకల్పన సాగింది. అది ఏ మేరకు ఆచరణ సాధ్యమో ఇప్పటికిప్పుడు చెప్పలేం. అయితే, అంతా నిరాశే అనడానికీ వీలు లేదు. మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా వ్యాపార వేత్తలను ఆర్థికంగా ఉత్సాహపరిచే ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’ను వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగించాలన్న నిర్ణయం ప్రశంసనీయం. అలాగే, సూక్ష్మ రుణ సంస్థల ద్వారా చిన్న కుటుం బాలకు రుణాలు అందేలా కేంద్రం బ్యాంకులకు హామీ ఇచ్చే పథకం లాంటివీ మెచ్చదగినవే. అయితే, టూరిస్టులకు ఉచిత వీసాల ప్రకటన వినడానికి బాగున్నా, వాళ్ళు రావాలంటే దేశంలో వ్యాక్సినేషన్ ఇంకా వేగంగా సాగాలి. కరోనా భయాలు లేకుండా సామాజిక ప్రశాంతత నెలకొనాలి. వ్యాపారాలు లేక కుదేలైన పర్యాటక, ఆతిథ్య రంగాల మొదలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల దాకా అన్నిటికీ మరిన్ని రుణాల బదులు నాన్–డెట్ క్యాపిటల్ సమకూర్చాలి. అలాగే, పట్టణ ప్రాంత నిరుపేదలకు నగదు బదిలీ ద్వారా తక్షణ ఆర్థిక సహకారం అందించాలి. నిజానికి, అమెరికా సహా అనేక దేశాలు ఈ కరోనా కాలంలో చేసింది అదే! ఒకపక్క మౌలిక వసతి కల్పన ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే, మరోపక్క ఆర్థికంగా అండగా నిలవడం వల్ల జనం కొనుగోళ్ళు చేస్తారు. పరిశ్రమల ఉత్పత్తులకు తగ్గట్టు అమ్మకాలు సాగి, వ్యాపారాలు పుంజుకుంటాయి. వెరసి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. మొత్తం మీద, మూడో వేవ్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ... కరోనా కష్టాల కడలి నుంచి ఆర్థిక వ్యవస్థను ఒడ్డునపడేయడానికి చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. ఇవ్వాల్సింది ఎంతో ఉంది. అందాక... ఆక్సిజన్ అందక కష్టపడుతున్న వివిధ రంగాలకు ఈ తాజా ప్యాకేజీ లెక్కల్లో చూపినంత ఉద్దీపన కాకపోయినా, కాసింత ఊపిరి! కొద్దోగొప్పో ఊరట!! అయితే, ఈ ప్యాకేజీలతోనే అంతా సర్దుకుంటుందని చంకలు గుద్దుకుంటేనే కష్టం!! -
ఏపీలో మళ్లీ సాధారణ స్థితికి జీవనచక్రం
పారిశ్రామిక రంగం.. పట్టాలపైకి.. సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో స్తంభించిన రాష్ట్ర పారిశ్రామిక రంగం క్రమంగా ఊపందుకుంటోంది. పరిశ్రమలను పునఃప్రారంభించడానికి ఏప్రిల్ 19న ‘రీస్టార్ట్’ పేరుతో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే 6,582 యూనిట్లు ప్రారంభం కాగా, మిగిలిన యూనిట్లు తమతమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ యూనిట్లు 20 శాతం సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ యూనిట్లు తిరిగి ప్రారంభించడం ద్వారా సుమారు 70,000 మందికి ఉపాధి లభించిందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే, పరిశ్రమల శాఖ వద్ద గుర్తింపు పొందిన కంపెనీలే కాకుండా.. అసంఘటిత రంగంలో ఉన్న చిన్న తరహా యూనిట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రీస్టార్ట్ ద్వారా ఇంకా అనేక సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. వీటిని కూడా కలుపుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా గనులు తిరిగి ప్రారంభం కావడం.. నిర్మాణ రంగంలో పనులు మొదలు కావడంతో లక్షలాది మందికి పనులు లభిస్తున్నాయి. కానీ, రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటివరకు 6,939 యూనిట్లు అనుమతులకు దరఖాస్తు చేసుకోగా, అందులో 6,582 సంస్థలు పనులు ప్రారంభించాయి. ఇందులో 3,555 యూనిట్లు రీస్టార్ట్ నిబంధనలు పాటిస్తున్నామంటూ సొంత ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాయి. మరో 1,893 యూనిట్లను అధికారులు స్వయంగా తనిఖీ చేసి పనులు ప్రారంభించడానికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఇక అత్యవసర సేవల కింద 1,134 యూనిట్లు లాక్డౌన్లో కూడా కార్యకలాపాలు కొనసాగించాయి. రీస్టార్ట్‌లో ‘ప్రకాశం’ వెలుగులు రీస్టార్ట్ కార్యక్రమం కింద అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 658 యూనిట్లు పనులు ప్రారంభించాయి. ఆ తర్వాత చిత్తూరు 632, విశాఖ 591, గుంటూరు 577, అనంతపురం 544, కృష్ణాలో 513 యూనిట్లు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కాకుండా.. నిర్మాణ రంగ పనులు ప్రారంభం కావడంతో బ్రిక్ యూనిట్లు సగానికి పైగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 1,943 ఇటుక బట్టీలు ఉండగా అందులో 60 శాతం యూనిట్లు పనులు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. ఇదే సమయంలో 53,786 నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. ఇందులో 10 శాతం పనులు ఇప్పటికే ప్రారంభించామని బిల్డర్లు చెబుతున్నారు. ఈ రంగానికి సంబంధించిన దుకాణాలు కూడా తెరుచుకోవడంతో నిర్మాణ రంగ పనులు కూడా ఇక వేగం పుంజుకుంటాయని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. వలస కార్మికులను రప్పించేందుకు టాస్క్‌ఫోర్స్ ఇదిలా ఉంటే.. లాక్డౌన్ వల్ల సొంత గ్రామాలకు వెళ్లిపోయిన వలస కార్మికులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చాలా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధంచేసుకున్నా కార్మికుల సమస్య వీటికి అవరోధంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కూలీల వివరాలను సేకరించి, వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీని అమలుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడే రీస్టార్ట్ ప్యాకేజీ లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి రీస్టార్ట్ ప్యాకేజీని ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించనున్నారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,110 కోట్లు అందించనుంది. ముందుగా రూ.993.97 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో ఎంఎస్ఎంఈల బలోపేతానికి గత ప్రభుత్వం పెట్టిన రూ.827.5కోట్ల బకాయిలతో సహా సుమారు రూ.905 కోట్ల మేరకు ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. మూడు నెలల విద్యుత్ బిల్లులపై రూ.187.80కోట్ల మేర స్థిర విద్యుత్ చార్జీల మాఫీ.. 6–8 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక పాత బకాయిలు విడుదలవల్ల 11,238 ఎంఎంస్ఎంఈ యూనిట్లు లబ్ధిపొందనున్నాయి. అలాగే, మొత్తం పాత బకాయిలు విడుదల, విద్యుత్ డిమాండ్ చార్జీలు రద్దు, రూ.200కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుతో సుమారు 98వేల యూనిట్లకు లబ్ధిచేకూరుతుంది. సందడిగా మార్కెటు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు ఒకొక్కటిగా సడలిస్తుండటంతో వ్యాపార సంస్థలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడంతో అన్ని రకాల మార్కెట్లలో సందడి వాతావరణం కనిపించింది. నిబంధనలకు లోబడి వ్యాపారులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. దీంతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కంటైన్మెంట్ ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రధాన పట్టణాల్లో బంగారం, వస్త్రదుకాణాలు, సెలూన్లు, హార్డ్‌వేర్ షాపులు, గృహోపకరణాలు, సిమెంట్, స్టీల్, బేకరీ, బుక్స్ అండ్ స్టేషనరీ దుకాణాలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారులు ఎప్పటిలా రోడ్లపక్కన వ్యాపారాలు సాగించారు. అలాగే, అన్ని జిల్లాల్లోనూ చిన్నచిన్న పరిశ్రమలు కూడా ఇప్పటికే తెరుచుకున్నాయి. చేనేత కార్మికులు కూడా పనులు ప్రారంభించారు. వెల్డింగ్, టైలరింగ్, ట్రాక్టర్ రిపేర్లు వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, లేత్ మిషన్లు కూడా తెరచుకోవడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం ♦ ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్ద పీట ♦ 25 నైపుణ్య కళాశాలలకు స్థల ఇబ్బంది ఉండొద్దు ♦ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్దపీట వేసేలా ముందుకెళ్లాలని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐటీ, మౌలిక వసతుల శాఖల ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 నైపుణ్య శిక్షణా కళాశాలల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి చోట కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణం కోసం భూమిని సేకరించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఇవ్వనున్న ఎమ్ఎస్ఎమ్ఈల ప్రోత్సాహకాల చెల్లింపులకు అవసరమైన ఏర్పాట్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక రంగం త్వరలో కొత్త పుంతలు తొక్కడం ఖాయమని మంత్రి అన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ♦ ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అధికారులంతా సమాయత్తం కావాలి. ♦ పరిశ్రమలు, నైపుణ్య, ఐటీ రంగాల పురోగతిని తెలియజేసేలా ప్రజెంటేషన్ రూపొందించాలి. ♦ రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు కార్యక్రమాల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలి. ♦ ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలలో ఉన్న కార్మికుల అవసరం, ప్రస్తుతం ఉన్నవారి జాబితాలను సిద్ధం చేయాలి. ♦ కోవిడ్ కారణంగా మూత పడ్డ పరిశ్రమలు, సొంత ప్రాంతాలకు తరలి పోయిన వలస కూలీల వివరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు వివరాలను సేకరించాలి. ♦ నైపుణ్య కొరత గల నిరుద్యోగులను గుర్తించి వారికి శిక్షణ అందించడం, ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై స్పష్టత వచ్చేలా చూడాలి. ♦ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో అర్జా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు సడలించడంతో గురువారం ఉదయం7 గంటలకే డిపోల నుంచి బస్సులు బయటకు వచ్చాయి. మొత్తం 900 పల్లెవెలుగు బస్సులు నడిచాయి. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లు వీటికి అదనం. మొత్తం మీద మొదటిరోజు 50 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడిచాయి. 1,125 బస్సులకు ప్రయాణికులు గ్రౌండ్ బుకింగ్ చేసుకోగా, 255 సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. 7,143 మంది ప్రయాణీకులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూ.19.50లక్షల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉంటే.. అన్ని జిల్లాల నుంచి సర్వీసులు నడిపిన ఆర్టీసీ.. గుంటూరు జిల్లా, ఒంగోలులో మాత్రం నడపలేదు. కంటైన్మెంట్ క్లస్టర్ల కారణంగానే ఈ జిల్లాల్లో బస్సులను తిప్పే ఆలోచనను ఆర్టీసీ విరమించుకుంది. కాగా, తొలిరోజు మొత్తం 1,683 బస్సు సర్వీసులు తిప్పాలని ఆర్టీసీ భావించినప్పటికీ 1,483 సర్వీసులు మాత్రమే నడిచాయి. దీంతో శుక్రవారం సర్వీసుల్ని తగ్గిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1,375 సర్వీసుల్ని, 5,500 ట్రిప్పుల్ని తిప్పేలా ఆర్టీసీ గురువారం రాత్రి నిర్ణయం తీసుకుంది. అలాగే, గుంటూరు జిల్లాలో శుక్రవారం 28 బస్సుల ద్వారా 112 ట్రిప్పులను తిప్పనున్నారు. ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్నదే సీఎం లక్ష్యం లాక్‌డౌన్‌వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూత పడకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రస్తుతం పరిశ్రమలను ఆదుకుంటే ఆ నమ్మకంతో కొత్త పెట్టుబడులు వస్తాయి. అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా గత ప్రభుత్వ పారిశ్రామిక బకాయిలను విడుదల చేయడం ద్వారా సీఎం జగన్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచారు. పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి ఏర్పడుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు వేశాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం. – గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి ఇది ఊహించని సాయం లాక్‌డౌన్‌తో సంక్షోభం ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీస్టార్ట్ పేరుతో పరిశ్రమలు ప్రారంభించడానికి అనుమతించారు. ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పాత పారిశ్రామిక బకాయిలను తీరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ప్రధానమంత్రికి సవివరంగా లేఖ రాశారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో పారిశ్రామిక వర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయి. – ముత్తవరపు మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు, ఏపీ చాంబర్స్ పరుగులు పెట్టిన ఆర్టీసీ ♦ రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన బస్సులు ♦ బస్స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ♦ వారం రోజులు ముందుగా రిజర్వేషన్లు ♦ ప్రయాణికులకు శానిటైజేషన్.. థర్మల్ స్క్రీనింగ్ ♦ మాస్కులు ఉంటేనే బస్సుల్లోకి అనుమతి లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాయి. బస్స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల చేతులకు శానిటైజర్‌తో శుద్ధిచేయించారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతించారు. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేశారు. పలుచోట్ల ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ముందు అనుకున్న దానికంటే ఎక్కువగా సర్వీసులు నడిపారు. జిల్లాల వారీగా చూస్తే.. ♦ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ.. నార్త్ ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్‌కి చెందిన తొమ్మిది డిపోల నుంచి 139 షెడ్యూల్స్‌ను తొలిరోజు ప్రారంభించింది. 30 ప్రధాన రూట్లలో 801 ట్రిప్స్‌కు ప్రణాళిక వేశారు. పక్క జిల్లాల ప్రధాన పట్టణాలకూ 96 ఎక్స్‌ప్రెస్, 41 ఆల్ట్రా డీలక్స్, రెండు సూపర్ లగ్జరీ సర్వీసులను నడిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు హెల్త్ చెకప్ చేసిన తరువాతనే ప్రయాణానికి అనుమతించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కూడా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ♦ తూర్పు గోదావరి వ్యాప్తంగా 9 డిపోల నుంచి 147 బస్సులు బయల్దేరాయి. రాజమహేంద్రవరం డిపో నుంచి విజయవాడ, విశాఖ డిపోలకు రెండేసి బస్సులు చొప్పున ముందుగా ప్రకటించారు. అయితే, ప్రయాణికులు అధికంగా బస్టాండ్‌కు చేరుకోవడంతో విశాఖకు ఐదు బస్సులు.. విజయవాడకు ఆరు బస్సులు ఏర్పాటుచేశారు. ♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడిచాయి. జిల్లా వ్యాప్తంగా 130 బస్సులు తిరిగాయి. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా బస్సుల్లో సీట్ల ఏర్పాటు, బస్టాండులో ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. బస్సు ఎక్కేముందే ప్రయాణికులకు టిక్కెట్లను జారీచేశారు. ♦ ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 106 సర్వీసులు నడిచాయి. ముందుగా 152 సర్వీసులను నడపాలని నిర్ణయించినప్పటికీ ఒంగోలు నగరపాలక సంస్థ మొత్తం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున 106 సర్వీసులకు మాత్రమే అనుమతించారు. రిజర్వేషన్ కౌంటర్లు, గ్రౌండ్ బుకింగ్ వద్ద టికెట్లను పొందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట డిపో మినహా మిగిలిన తొమ్మిది డిపోలకు చెందిన 109 బస్సులు మొదటి రోజు నడిచాయి. 652 ట్రిప్పులు నడపాలని అనుకున్న అధికారులు 463 ట్రిప్పులకు పరిమితం చేశారు. ప్రధానంగా జిల్లా నుంచి తిరుపతి, కడప, ఒంగోలు, విజయవాడకు బస్సులు నడిచాయి. ♦ అనంతపురం జిల్లా పరిధిలోని 12 డిపోల నుంచి 111 సర్వీసులు తిప్పారు. అనంతపురం నుంచి కర్నూలు, వైఎస్సార్ కడప, మదనపల్లి, గుంతకల్, రాయదుర్గం ప్రాంతాలకు 13 బస్సులు నడిచాయి. ధర్మవరం నుంచి కర్నూలుకు రెండు బస్సులు నడిపారు. అదే విధంగా వివిధ డిపోల నుంచి ఇతర జిల్లాలకు 96 బస్సులు నడిపారు. ♦ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 29 రూట్లలో 126 బస్సులను 632 ట్రిప్పులను తిప్పారు. ♦ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 191 బస్సులను నడపాలని భావించారు. అయితే, సత్యవేడు, శ్రీకాళహస్తి బస్సులకు బ్రేక్ పడడంతో 165 సర్వీసులు మాత్రమే రోడ్డెక్కాయి. ♦ వైఎస్సార్ జిల్లాలో మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా 98 బస్సులు రాకపోకలు సాగించాయి. దూర ప్రాంతాల ప్రయాణీకులు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోగా, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు బస్సుల వద్దే టికెట్లను కొనుగోలు చేశారు. -
ట్రంప్ టవర్‌లో మరోసారి కలకలం
న్యూయార్క్: న్యూయార్క్‌లోని ట్రంప్ ట్రవర్స్‌లో మరోసారి కలకలం రేగింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన మాన్‌హట్టన్‌లోని టవర్‌వద్ద శుక్రవారం కనిపించిన పలు అనుమానాస్పద ప్యాకేజీలు న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెమటలు పట్టించాయి. ప్రాథమికు పరిశీలన అనంతరం ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్లో ప్రకటించింది. ట్రంప్ సొంతమైన 58 అంతస్థుల భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను భద్రతా సిబ్బంది గమనించారు. అనంతరం జరిపినవిస్తృత పరిశోధన మరో రెండు ప్యాకెట్లు లభించడంతో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించి తనిఖీలు చేపట్టారు. భవనంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను గమనించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎన్‌వైపీడీ ప్రజాసమాచార అధికారి సెర్జెంట్ విన్సెంట్ మార్చీజ్ తెలిపారు. The situation at Trump Tower (725 5th Ave, #Manhattan) has been assessed. There is no danger at this time. — NYPD NEWS (@NYPDnews) July 27, 2018 -
చలో భారత దర్శన్
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్): వేసవి సెలవులను ప్రయాణికులు ఆహ్లాదంగా గడిపేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్పెషల్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తర, దక్షిణ భారత యాత్రల పేరిట రెండు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. గంగ, యమున యాత్ర ఈ నెల 18 నుంచి, దక్షిణ భారత యాత్ర మే 4 నుంచి ప్రారంభం కానుంది. భోజన సదుపాయం, వసతి, రవాణా అంతా ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది. ఈ రెండు ప్యాకేజీల వివరాలను ఐఆర్సీటీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ మేనేజర్ బబ్లూమీనా, ఐఆర్సీటీసీ సీనియర్ సూపర్వైజర్ పవన్‌కుమార్ పాల్గొన్నారు. రేపటి నుంచే.. గంగ యమున యాత్ర ఈ నెల 18 నుంచిలై 29 వరకు కొనసాగుతుంది. 18న తెల్లవారుజామున 12.05 గంటకు ప్రత్యేక రైలు రేణిగుంట నుంచి బయల్దేరి కడప, యర్రగుంట్ల, గుత్తి, కర్నూల్, మహబుబ్‌నగర్ మీదుగా మధ్యాహ్నానికి కాచిగూడకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రైలు కాజీపేట్, రామగుండం మీదుగా 19న సాయంత్రం ఆగ్రాకు చేరుకుంటుంది. అక్కడ ఆగ్రా ఫోర్ట్, తాజ్‌మహల్ దర్శనం అనంతరం రాత్రి అక్కడే బస ఉంటుంది. అనంతరం ప్రత్యేక రైలులో 20న మధురకు తీసుకెళ్లి శ్రీకృష్ణ ఆలయం, శ్రీ కృష్ణుడి జన్మస్థానం చూపిస్తారు. అనంతరం తర్వాతి రోజు ఢిల్లీ చేరుకుంటారు. 21, 22 తేదీల్లో అక్షరధామ్, లోటస్ ఆలయాలు, కుతుబ్మీనార్, రాజ్‌ఘాట్, ఇండియా గేట్ చూపించి, షాపింగ్ చేయిస్తారు. 22న రాత్రి రైలు ఢిల్లీ నుంచి బయల్దేరి 23న హరిద్వార్‌కు చేరుకుంటుంది. అక్కడ గంగాస్నానం అనంతరం మానస దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ప్రత్యేక 24న ఆయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ రామజన్మ భూమి దర్శనం అనంతరం 25న అలహాబాద్‌కు తీసుకెళ్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల అనంతరం ఆనంద్భవనం మ్యూజియం చూపిస్తారు. 26న వారణాసి చేరుకుని గంగాస్నానం, గంగా హారతి, కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయాలు దర్శించుకుంటారు. 27న గయాకు చేరుకుంటారు. అక్కడ పెద్దలకు పిండ ప్రదానం తదితర కార్యక్రమాలు చేయిస్తారు. అనంతరం ప్రత్యేక రైలు 29న ఉదయం రైలు కాచిగూడకు చేరుకోవడంతో ఉత్తర భారత యాత్ర పూర్తి అవుతుంది. ఈ రైలులో మొత్తం 12 స్లీపర్ కోచ్‌లు, ఒక త్రీ టైర్ ఏసీ, ఒక పాన్‌ట్రీ కారు ఉంటుంది. 11 రాత్రులు, 12 పగళ్లు కొనసాగే ఈ ప్యాకేజీ ధర స్లీపర్ కోచ్ అయితే రూ.11,340, ఏసీ అయితే 13,860 ఉంటుంది. పిల్లలకైనా, పెద్దలకైనా టికెట్ ధరల్లో మార్పు ఉండదు. 4 నుంచి దక్షిణ భారత యాత్ర.. మే 4 నుంచి దక్షిణ భారత యాత్ర ప్రారంభ మవుతుంది. తెల్లవారు జామున 12.05 గంటలకు ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోల్, నెల్లూర్, రేణిగుంట మీదుగా తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. అక్కడ రంగనాథస్వామి, బ్రుహదీశ్వర ఆలయాల దర్శనం రామేశ్వరం వెళ్తారు. అక్కడి నుంచి మధురైలో మీనాక్షి ఆలయం, కన్యాకుమారిలో పర్యాటక ప్రాంతాల దర్శనం ఉంటుంది. అనంతరం త్రివేండ్రం వెళ్లి అక్కడి పద్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గురువాయుర్‌కు చేరుకుని శ్రీ కృష్ణ ఆలయ దర్శనం చేయిస్తారు. ఆ తర్వాత కాట్పాడి మీదుగా శ్రీపురం బంగారు ఆలయం దర్శనం అనంతరం తిరుపతి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. 8 రాత్రులు 9 పగళ్లు కొనసాగే ఈ యాత్ర టికెట్ ధర స్లీపర్ క్లాస్ అయితే రూ.8,505, ఏసీ త్రీ టైర్ అయితే రూ.10,395 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.irctctourism.com దర్శించవచ్చు. టికెట్ బుక్ చేసుకోండి.. ఐఆర్సీటీసీ జోనల్ కార్యాలయం 040 2770 2407, 97013 60701, 97013 60647/671/697, 837400 07782/783, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 9701360690, పర్యాటక భవన్ 040–2340 0606, 97013 60698. -
కార్పొరేట్ వారసులకూకోట్లలో వేతనాలు
బాధ్యతలు అప్పగించగానే ప్యాకేజీలు న్యూఢిల్లీ: వస్తూ వస్తూనే కోటీశ్వరుల క్లబ్లో చేరిపోతున్నారు ప్రముఖ వ్యాపారవేత్తల వారసులు. అంబానీల నుంచి అదానీల వరకు, ప్రేమ్‌జీ నుంచి ఖొరాకివాలా వరకు దేశంలో కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ఇతర వ్యాపార సంస్థల్లో చేరిన తదుపరి తరం నాయకులు వేతనాలు, పారితోషికాల రూపంలో అప్పుడే కరోడ్‌పతి క్లబ్లో చేరిపోయారు. చాలా మంది తమ కుమారులు, కుమార్తెలను తమ వారసులుగా కీలక బాధ్యతల్లోకి తీసుకొస్తున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి మంచి ప్యాకేజీలనే ఫిక్స్ చేసేస్తున్నారు. అదానీ వారసుడికి రూ.కోటిన్నర ⇔ అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ కుమారుడు కరణ్... అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సీఈవోగా నియమితులయ్యారు. 2015-16లో ఎలాంటి వేతనాన్నీ అందుకోలేదు. అయితే, వేతనం, ఇతర పారితోషికాలు, ప్రయోజనాల రూపంలో కరణ్‌కు రూ.1.5 కోట్లను ఈ సెప్టెంబర్ 1 నుంచి చెల్లించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. అనుమోల్ అంబానీకి రూ.1.2 కోట్లు ⇔ అనిల్ అంబానీ కుమారుడు జై అనుమోల్ అంబానీ (24) ఇటీవలే గ్రూపు కంపెనీ రిలయన్స్ కేపిటల్లో డెరైక్టర్‌గా చేరిపోయారు. ఆయనకు నెలకు రూ.10 లక్షల చొప్పున వేతనాన్ని చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. వేతనానికి అదనంగా అలవెన్స్‌లు, కమీషన్లు, ఇతర ప్రతిఫలాలు కూడా అందించేందుకు బోర్డు సుముఖత చూపింది. ముకేశ్ వారసుల సంగతో...? ⇔ దేశీయ సంపన్నుడిగా వెలుగుతున్న ముకేశ్ అంబానీ వారసులు గ్రూపు కంపెనీల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కుమార్తె ఇషా, ఆకాష్ జియో వెనుకనున్న విషయం తెలిసిందే. అయితే, వీరి వేతనాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టీవీఎస్ వారసుడికి రూ.10 కోట్లు ⇔ టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ వేణు జాయింట్ ఎండీగా గత ఆర్థిక సంవత్సరానికి రూ.9.59 కోట్లు అందుకున్నారు. ఇతర వారసుల వేతనాలు ⇔ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, ఈడీగా ఉన్నారు. 2015-16లో ఆయన వేతనం రూ.2.15కోట్లు. ⇔ ఫార్మా కంపెనీ వోకార్డ్ చైర్మన్ హబిల్ ఖొరాకివాలా వేతనం 1.32 కోట్లు. కంపెనీలో ఈడీ, ఎం డీలుగా ఉన్న ఆయన కుమారులు హుజైఫా, ముర్తజాల వేతనం రూ.1.32 కోట్ల చొప్పున ఉంది. ⇔ మరో ఫార్మా కంపెనీ సిప్లా చైర్మన్ వైకే హమీద్ మేనకోడలు సమీనా వజిరల్లి 2015-16లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా రూ.2.47 కోట్ల వేతనాన్ని తీసుకున్నారు. అయితే, ఆమె ఈ నెల 1 నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ప్రమోట్ అయ్యారు. ⇔ డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీసింగ్ కుమారుడు రాజీవ్ సింగ్ కంపెనీ వైస్ చైర్మన్‌గా తీసుకున్న వేతనం రూ.4.42 కోట్లు. -
విహార యాత్రికులకోసం ప్రత్యేక ప్యాకేజీలు
రాజమహేంద్రవరం సిటీ : విహార యాత్రలు చేయాలనుకునేవారికోసం ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించినట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) డీజీఎం సంజీవయ్య తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వీఐపీ లాంజ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. హాంకాంగ్, మకావ్, షెంజన్ పర్యటన కోసం 4 రాత్రులు, 5 పగళ్లతో అక్టోబరు 8–12 తేదీల మధ్య ప్యాకేజీ అందుబాటులో ఉంటుందన్నారు. దీనికింద ఒక్కొక్కరు రూ.73,419 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 21–24 తేదీల్లో 4 పగళ్లు, 3 రాత్రులతో గోవా ప్యాకేజ్ ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఒక్కొక్కరు రూ.18,970 చెల్లించాలన్నారు. డిసెంబరు 10–14 తేదీల మ««దl్య శ్రీలంక టూర్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రాత్రుళ్లు, 5 పగళ్లు ఉండే ఈ టూర్‌కు ఒక్కొక్కరు రూ.45,001 చెల్లించాలని వివరించారు. ఈ ప్రయాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదలై తిరిగి అక్కడే ముగుస్తుందన్నారు. ప్రయాణ సమయంలో త్రీస్టార్ సౌకర్యాలతో అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు. వివరాలకు 0866 – 2752280, 97013 60632 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని సంజీవయ్య వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రభాకరరావు, స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రమణ్యశాస్త్రి పాల్గొన్నారు. -
రైల్లో.. చలో
♦ ఐఆర్సీటీసీలో స్టూడెంట్ స్పెషల్ టూర్స్ ♦ పర్యాటక సంస్థతో కలిసి ప్యాకేజీలు ♦ త్వరలో ప్రారంభం సాక్షి, హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ ప్యాకేజీలు, విమాన సర్వీసులను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా స్టూడెంట్ స్పెషల్ టూర్‌కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల విజ్ఞాన, విహార యాత్రల అభిరుచికి అనుగుణంగా త్వరలో ఈ ప్యాకేజీలు అందుబాటులోకి రానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలతో పాటు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలకు రైలు మార్గంలో స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బోగీలను ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా వివిధ జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు, ఇతర ప్రాంతాలను పరిచయం చేసే లక్ష్యంతో స్టూడెంట్స్ స్పెషల్ టూరిస్టు ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. విద్యార్థులకు రవాణా, భోజనం, వసతి,గైడ్, తదితర అన్ని సదుపాయాలతో తక్కువ చార్జీల్లోనే ఈ ప్యాకేజీలు ఉంటాయి. మరో వారం, పది రోజుల్లో ఈ తరహా పర్యాటక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ వెలువరించనుంది. మరోవైపు విద్యార్థులకు అవసరమైన వసతి, తదితర ఏర్పాట్ల కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థుల భద్రత ప్రధానం.. ప్రస్తుతం దసరా, సంక్రాంతి వంటి సెలవు రోజుల్లో విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లేందుకు విద్యాసంస్థలు ప్రైవేట్ పర్యాటక సంస్థలపై ఆధారపడి వెళ్లవలసి వస్తోంది. ఈ పర్యటనల్లో విద్యార్ధులకు కానీ, కొన్ని పర్యాటక సంస్థలకు కానీ ఆయా ప్రాంతా ల భౌగోళిక పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం,అనుభవం ఉన్న గైడ్స్ లభించకపోవడం వంటి కారణాల దృష్ట్యా పిల్లలను టూర్లకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా బియాస్ నది దుర్ఘటన అనంతరం టూర్ల పట్ల అందరిలోనూ అభద్రతా భావం నెలకొంది. విద్యాసంస్థలు సైతం రిస్క్ తీసుకొనేందుకు వె నుకడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక రంగం పట్ల అపారమైన అనుభవం ఉన్న కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ఈ ప్రత్యేక ప్యాకేజీలపై దృష్టి సారించింది. పర్యాటకాభివృద్ధి సంస్థతో సమన్వయం.. విద్యార్థులకు అవసరమైన రాష్ట్రస్థాయి ప్యాకేజీలు, పర్యాటక ప్రాంతాల ఎంపిక, వసతి, తదితర అంశాలపై ఐఆర్సీటీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ప్యాకేజీల రూపకల్పనపై ఒకరి నుంచి ఒకరికి లభించవలసిన సహాయ సహకారాలపైన చర్చించారు. సమన్వయంతోనే ఇది విజయవంతం కాగలదని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
'అటా' ఆధ్వర్యంలో 5కే రన్
హైదరాబాద్: వచ్చే ఏడాది జూలై 1 నుంచి చికాగోలో అటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో తెలురాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలకు 'అటా' శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్ లో జరిగిన సమావేశంలో 'అటా' అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 7 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అటా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. 19న 'హైదరాబాద్ అటా రేస్' పేరుతో నెక్లెస్ రోడ్లో 5కే రన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల 20న శిల్పారామంలో గ్రాండ్ ఫినాలె ఉంటుందని చెప్పారు. ఫినాలెలో వివిధ రంగాల్లో స్ఫూర్తి ప్రదాతలను ఎంపిక చేసి ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ నెల 19 జరిగే సంగీత, నృత్య పోటీల్లో విజేతలను అమెరికాలో అటా రజతోత్సవ వేడుకలకు తీసుకెళ్లి సన్మానించనున్నట్టు తెలిపారు. -
హక్కు హక్కే.. భిక్షం భిక్షమే
'హోదా'ను వదులుకుంటే ఏపీకి తీరని నష్టం ప్యాకేజీలను స్వీకరిస్తే పెద్ద తప్పవుతుంది అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: విభజనలో అన్నింటా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ప్యాకేజీలకు అంగీకరించి 'హోదా' ను వదులుకుంటే తీరని నష్టం జరుగుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. శాసనసభలో మంగళవారం ప్రత్యేక హోదా తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీల్లో ఏది మేలనే అంశాన్ని ఉదాహరణలతో వివరించారు. ''ప్రత్యేక హోదా అనేది హక్కు.. ప్యాకేజీ అనేది భిక్షం.. ఎప్పుడైనా హక్కు హక్కే.. భిక్షం భిక్షమే. మన ప్రమేయం లేకుండా అన్యాయంగా విభజించడం వల్ల రాష్ట్ర అభివృద్ధి బాధ్యత కేంద్రంపై ఉంది. చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం అమలు చేయాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ మేం చేసుకుంటామని రాష్ట్రం అంటే చివరకు నష్టపోవాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం బాధ్యతలను కేంద్రానికి ఇవ్వకుండా మేమే చేపడతామని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్లుగా కేంద్రం భావించే ప్రమాదం ఉంది. ఒక ఇంట్లో ఇద్దరు కవల పిల్లలుంటే.. ఏడ్చే పిల్లాడికే ఎక్కువ పాలు దక్కుతాయి. ఇక్కడ కూడా అంతే. రాష్ట్రం సొంతంగా చేసుకునే స్థాయిలో ఉందనుకుంటే కేంద్రం అందించే సాయంలో వాటా తగ్గిస్తుంది'' అని బుగ్గన వివరించారు. బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే ఆ రాష్ట్ర సీఎం నితీష్ తిరస్కరించారని, హోదాయే కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు అయోమయ ప్రకటనలు చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. ఇలాంటి ప్రకటనల వల్లే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. హోదాతో అనేక ప్రయోజనాలున్నాయని, పరిశ్రమలు భారీగా రావడానికి ఇది తోడ్పడుతుందని వివరించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తాయన్నారు. -
ప్యాకేజీలు ఆమోదయోగ్యంకాదు..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే కావాలని, ప్యాకేజీలు ఆమోదయోగ్యం కాదని, హోదా సాధించే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పార్టీ అభిప్రాయపడింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 28న తలపెట్టిన బంద్‌ను వరలక్ష్మీ వ్రతం కారణంగా 29వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఈ బంద్‌లో ఏపీ సర్వతోముఖాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కాంక్షించే ప్రజా సంఘాలు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా వామపక్షాలను కూడా సంప్రదించామని, వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన తరువాత సీఎం నేతృత్వంలో టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెర తీశారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సంప్రదించిన అనంతరం చెబుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని జైట్లీ చెబుతున్న సమయంలోనే ఆయన పక్కనే మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు ఉండి ఆయనకు వంత పాడటం విడ్డూరమన్నారు. నెలలోగా హోదా వస్తుందని సుజనా చేసిన వార్తల క్లిప్పింగ్‌లను చూపించారు. ఇలాంటి హామీలు ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారని ప్రశ్నించారు. -
ప్యాకేజీలు కాదు.. ప్రత్యేక హోదా కావాలి
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదా కావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రత్యేక హోదాపై గళమెత్తారు. - హామీల సాధన కమిటీ ఎన్నిక మధురానగర్ : నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీలు వద్దని ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీనగర్‌లోని చాంబర్ ఆప్ కామర్స్ హాలులో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దోనేపూడి శంకర్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్ర నటిస్తున్నాయని నిద్రపోయేవారిని లేపవచ్చని నటిస్తున్నవారిని లేపలేమన్నారు. ప్రత్యేక హోదావస్తే పన్నుల్లో భారీగా రాయితీలు లభిస్తాయన్నారు. నెలకు మూడు వేలు సంపాదించేవారు సైతం ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన 500 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మళ్లించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కేంద్రమంత్రులు వెంటనే రాజీనామా చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, లోక్‌సత్తా నగర అధ్యక్షుడు అశోక్‌కుమార్, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, చాంబర్ ప్రతినిధి పొట్లూరి భాస్కరరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు కోనేరు రమేష్, ఈశ్వరరావు, పెనుమత్స సత్యనారాయణ రాజు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అధినేత చెరుకూరి సత్యనారాయణ, డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు, పోతిన రాము, ఎస్వీ గ్రిటన్ వివిధ సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక హోదా విభజన బిల్లులోని హామీల సాధనకమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడిగా ఎంసీ దాస్, ప్రధాన కార్యదర్శిగా దోనేపూడి శంకర్ ఎన్నికయ్యారు. -
హంద్రీ-నీవా పనులకు కొత్త టెండర్లు
- రూ.39.87కోట్ల పనులకు రూ.160కోట్ల అంచనా - రద్దుచేసిన 14, 31 ప్యాకేజీలు - 6, 10, 15 ప్యాకేజీల్లో అసంపూర్తి పనులు రూ.39.87కోట్లు - వీటి టెండర్లకు సిద్ధమవుతున్న సర్కారు బి.కొత్తకోట: హంద్రీ-నీవా సాగునీటి ప్రాజెక్టు రెండో దశలో ప్రభుత్వం రద్దుచేసిన రెండు ప్యాకేజీలు, అసంపూర్తిగా ఆగిపోయిన మరో రెండు ప్యాకేజీల్లోని పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కొత్తగా టెండర్లకు సిద్ధమవుతోంది. కాంట్రాక్టర్లు చేసుకున్న ఒప్పందంలో రూ.39.87కోట్ల అసంపూర్తి పనులు పెండింగ్‌లో ఉండగా, వీటికి రూ.160కోట్లతో కొత్తగా టెండర్లు నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని 31వ ప్యాకేజీలో అసంపూర్తి పనులను ఓ సంస్థకు అప్పగించారు. మదనపల్లె సర్కిల్ పరిధిలోని అనంతపురం జిల్లాలో 14వ ప్యాకేజీకి చెందిన ప్రధానకాలువ, చిత్తూరు జిల్లాలో 31వ ప్యాకేజీ వాల్మీకిపురం కాలువ పనులను దక్కించుకున్న ల్యాంకో ఇన్ఫ్రా సంస్థ పనులు పూర్తి చేయకపోవడంతో గురువారం సంస్థను పనుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. శ్రీఅవంతిక-సాయివెంకట సంస్థ అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతంలోని 6, 10 ప్యాకేజీలు, కదిరి ప్రాంతంలోని 15వ ప్యాకేజీల్లో పనులు అసంపూర్తిగా నిలిపివేయడంతో కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 5 ప్యాకేజీలకు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా, నాలుగింటికి భారీ అంచనాలతో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. అసంపూర్తి పనులు రూ.39.87కోట్లు టెండర్లు పిలవనున్న నాలుగు ప్యాకేజీల్లో అసంపూర్తిగా ఉన్న పనుల విలువ రూ.39.87కోట్లు. 14వ ప్యాకేజీ పనుల ఒప్పంద విలువ రూ.57.26కోట్లలో రూ.45.17కోట్ల పనులు జరిగాయి. 31వ ప్యాకేజీలో రూ.31.93కోట్ల పనుల్లో రూ.23.38కోట్ల పనులు పూర్తిచేశారు. 6వ ప్యాకేజీ విలువ రూ.32.4కోట్లలో రూ.26.14కోట్ల పనులు, 10వ ప్యాకేజీలో రూ.28.08కోట్ల పనుల్లో రూ.21.33కోట్ల పనులు, 15వ ప్యాకేజీలో రూ.27కోట్ల పనులకు రూ.20.78కోట్ల పనులు జరిగాయి. ఈ ప్యాకేజీల్లో రూ.176.67కోట్ల పనులకు రూ.136.8కోట్ల పనులు చేశారు. మిగిలినవి పనులు చేపట్టకపోవడంతో అసంపూర్తిగా ఆగిపోయాయి. కొత్త అంచనాలు రూ.160కోట్లు! 6, 10,14, 15 ప్యాకేజీల పనులను కొత్తగా అప్పగించేందుకు అంచనాలు రూ.160కోట్లకు చేరుతున్నాయి. దీనిపై ప్రాజెక్టు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఎస్ఎస్ఆర్ పట్టికను జారీచేసింది. దీన్ని జూలై ఒకటి నుంచే వర్తింపజేయనున్నారు. దీంతో 6వ ప్యాకేజీ పనులకు రూ.30కోట్లు, 10వ ప్యాకేజీకి రూ.30కోట్లు, 14వ ప్యాకేజీకి రూ.70కోట్లు, 15వ ప్యాకేజీకి రూ.30కోట్ల అంచనాలను ప్రాథమికంగా సిద్ధం చేశారు. కొంత మార్పులతో ఖరారు చేయనున్నారు. 10రోజుల్లో టెండర్లు నిర్వహించేలా చర్యలు వేగవంతం చేశారు. కాగా 14వ ప్యాకేజీలో రూ.12.09కోట్ల అసంపూర్తి పనులకు ఏకంగా రూ.70కోట్లకు అంచనాలు పెంచుతున్నారు. 31వ ప్యాకేజీలో రూ.8.55కోట్ల పనులను పూర్తిచేసేందుకు ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థ ముందుకు రావడంతో పనులు ఆ సంస్థకు అప్పగించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. కొత్త టెండర్లపై మదనపల్లె సర్కిల్ ఎస్ఈ మురళీధర్‌రెడ్డి వివరణ కోరగా, పనులు అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 6, 10,14, 15 ప్యాకేజీల్లోని అసంపూర్తి పనులు, కుప్పం బ్రాంచ్‌కెనాల్ పనులకు ఒకేసారి టెండర్లకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ప్రేమను పంచే రోజు
-
సవరణలు తప్ప సమైక్యం ఊసెత్తని సీమాంధ్ర మంత్రులు
-
ప్యాకేజీల కోసం మేము పోరాడటం లేదు: బొత్స
-
టీడీపీ సొంతింటి ప్యాకేజీ...!
పార్టీలోకి వచ్చే నేతలకే కాదు.. పార్టీని వీడిపోతారనే నేతలను బుజ్జగించడానికీ టీడీపీలో ప్యాకేజీలు ఇస్తున్నారు. ఈ సొంతింటి ప్యాకేజీ సంగతి గురించి తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఇదేదో బాగానే ఉందే అనుకుంటున్నారు. విషయమేమిటంటే.. కాంగ్రెస్‌తో కుదిరిన ప్యాకేజీలో భాగంగా నేడో రేపో పార్టీ మారిపోతున్నాడని ఒక తెలంగాణ నాయకుడిపై టీడీపీలో కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాయకుడు పార్టీ ‘టీ’ నేతల మేధోమథన సదస్సులో అందరికీ షాకిచ్చారు. ‘‘పార్టీ మారుతున్నట్టు నాపై లేనిపోని ప్రచారం జరుగుతోంది. చూడండి.. నా గుండెల్లో చంద్రుడు(చంద్రబాబు) ఉన్నారు’’ అంటూ చొక్కా విప్పి మరీ తన ఛాతీని అక్కడున్నవారికి చూపించేశారు. పురాణాల్లో హనుమంతుడు తన రామభక్తిని చాటినట్టు ఈయన తన చంద్రభక్తిని చాటడంపై ఆ నేతలంతా ఆశ్చర్యపోయారు. నిన్నటివరకు రోజూ తిడుతున్న నాయకుడే ఒక్కసారిగా ఇలా భక్తి చాటుకోవడంలో ఆంతర్యమేంటా అని ఆరా తీసేసరికి అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారట. టీ టీడీపీ ఫోరానికి చెందిన ఆ నేత కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో బాబు ఆయన్ను రహస్యంగా పిలిపిం చుకుని మాట్లాడారట. అసలే పార్టీ స్థితి దయనీయంగా మారుతున్న టైమ్‌లో మీలాంటి నేతలు బయటికెళ్లిపోతే ఎలా? అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారట. దాంతో పార్టీలో ఉండాలంటే ఇవి చేయండంటూ చాంతాడంత కోరికల చిట్టా విప్పారట. ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు టికెట్ ఇచ్చినా గెలిచే స్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు నేను ఖర్చుపెట్టుకుని ఏం సాధిస్తాను. అందుకే ఇప్పట్నుంచి ఎన్నికలదాకా అయ్యే ఖర్చుతో పాటు ఎన్నికల ఖర్చునూ పూర్తిగా మీరే భరించాలి. నేను ఓడితే ఆ తర్వాత నాకు రాజ్యసభ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వాలి’’ అంటూ జాబితా చెప్పుకుపోయారట. అందుకు అధినేత ఓకే అన్నారట. దాంతో సదరు నేత మీటింగ్లోకొచ్చి తన చంద్రభక్తిని చాటుకున్నారట. ఓహో! పార్టీలోకి వచ్చేవారికే కాదు! పార్టీని వీడిపోతారని ప్రచారం జరిగినా ప్యాకేజీలు ఇస్తారన్నమాట. ఇదేదో బాగుందే.. మనమూ ఆ ఫీలర్స్ వదిలితే పోలే...!! అని పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట..! -
సమైక్యమన్న నోట..ప్యాకేజీల పాట