మాస్కో: అడవిలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పడానికి 10మందితో వెళ్లిన ఓ అతిపెద్ద విమానం కనిపించకుండాపోయింది. ఈ ఘటన రష్యాలో జరిగింది. తూర్పు శివారు ప్రాంతమైన ఇర్కుట్‌స్కీలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పడానికి ఇల్యూషిన్ ఐఎల్-76 విమానం పదిమంది సిబ్బందితో బయలుదేరింది. ఉదయం బయలుదేరిన ఈ విమానం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చివరిసారిగా సమాచారమిచ్చింది. ఆ తర్వాత రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో ఆ విమానం ఏమైందనే ఆచూకీ తెలియకుండా పోయిందని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐఎల్-76 విమానం ప్రపంచంలోనే మంటలు ఆర్పే అతిపెద్ద విమానం. ఈ విమానంలో ఐదుగురు విమాన సిబ్బంది, ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని, విమానం ఆచూకీ కోసం గాలిస్తున్నామని రష్యా అధికారులు తెలిపారు.
మంటలార్పడానికి వెళ్లి.. మాయమైంది!
Published Fri, Jul 1 2016 8:16 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement