తన విమానంలోకి జర్నలిస్టులకు ఓకే | Hillary Clinton to finally allow journalists on her plane | Sakshi
Sakshi News home page

తన విమానంలోకి జర్నలిస్టులకు ఓకే

Published Sat, Sep 3 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

తన విమానంలోకి జర్నలిస్టులకు ఓకే

తన విమానంలోకి జర్నలిస్టులకు ఓకే

ఎట్టకేలకు తన ప్రచారక విమానంలోకి అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విలేకరులను అనుమతించింది.

న్యూయార్క్: ఎట్టకేలకు తన ప్రచారక విమానంలోకి అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విలేకరులను అనుమతించింది. ఇప్పటికే ఆమె పూర్తి చేసిన 272 రోజుల ప్రచారంలో ఆమె ప్రయాణిస్తున్న విమానంలో మీడియా ప్రతినిధులతో సమావేశానికి ఆమె అనుమతించలేదు.

అయితే, ఇక ఈ నెల (సెప్టెంబర్) 5 నుంచి మీడియా ప్రతినిధులకు నేరుగా తన విమానంలోనే ప్రెస్ మీట్ అవకాశం ఇవ్వనున్నారు. ఈ విమానంలో హిల్లరీతోపాటు ఆమె సలహాదారులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, రిపోర్టర్లు ఉండనున్నారు. ఒహియో, ఇల్లినాయిస్లో భారీ ప్రచారంతో సెప్టెంబర్ 5న హిల్లరీ బిజిబిజీగా మారనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement