తిరువొత్తియూరు: అండమాన్‌లో సుడిగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో చైన్నె నుంచి 156 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం తిరిగి చైన్నెకి చేరుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానాశ్రయ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అండమాన్‌కు 150 మంది ప్రయాణికులు, ఆరుగురు వి మానాశ్రమాల ఉద్యోగులతో ఇండిగో విమాన ము బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. అండమాన్ సరిహద్దుకు వెళ్లిన సమయంలో అక్కడ తీవ్రమైన సుడిగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
దీంతో విమానం అండమాన్ వద్ద ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. దీంతో వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పైలట్ చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూంను సంప్రదించారు. చైన్నె విమానా శ్రయ అధికారులు విమానాన్ని తిరిగి చైన్నెకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పైలట్ విమానా న్నిసాయంత్రం 5.10లకు చైన్నె ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అండమాన్‌లో ప్రతికూల వాతావరణంతో విమానాన్ని రద్దు చేశారు.
గురువారము ఉదయం చైన్నె నుంచి అండమాన్‌కు బయలుదేరు తుందని ప్రకటించారు. ప్రయాణికులు అందరూ అదే టికెట్‌తో విమానంలో ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయ ఉద్యోగులతో వాగ్వివాదానికి దిగారు. 150 మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకొని వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో అండమాన్ నుంచి విమానంలో చైన్నెకి రావడానికి 162 మంది ప్ర యాణికులు అండమాన్ విమానాశ్రయంలో వేచి ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment