
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పాక్ తన కమర్షియల్ ఆపరేషన్స్‌ను రద్దు చేయడంతో భారత్‌లో దేశీయ విమాన సర్వీసులు ముఖ్యంగా పశ్చిమ సెక్టార్‌లో పెనుభారమయ్యాయి. ఢిల్లీ-ముంబై వన్‌వే ప్రయాణానికి గురువారం పలు ఎయిర్‌లైన్లలో విమాన చార్జీలు రూ 20,000 నుంచి ప్రారంభమయ్యాయి.
పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిచిన క్రమంలో చార్జీలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. ఒక స్టాప్‌తో ఢిల్లీ-ముంబై మధ్య విమానాలకు రూ 8500 నుంచి పలు విమానయాన సంస్థలు చార్జ్ చేస్తున్నాయి. ఇక న్యూఢిల్లీ-గోవా రూట్‌లో విమాన చార్జీలు రూ 12,000 నుంచి ప్రారంభమయ్యాయి. మరోవైపు ఢిల్లీ-శ్రీనగర్ రూట్‌లో కేవలం ఒకటి రెండు ఎయిర్‌లైన్స్ మాత్రమే విమాన సర్వీసులను నడుపుతుండగా ఈ రూట్‌లో విమాన సర్వీసులకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment