సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలను మూటగట్టుకున్న ఎయిర్ ఇండియా కష్టాల ఊబి నుంచి బయటపడి లాభదాయకతను పెంచుకునే క్రమంలో సరికొత్త దారులు అన్వేషిస్తోంది. బిజీ రూట్లలో తక్కువ చార్జీలతో రాత్రి వేళ విమాన సర్వీసులను ప్రారంభించింది. బెంగళూర్ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి బెంగళూర్, ఢిల్లీ నుంచి కోయంబత్తూర్, కోయంబత్తూర్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి గోవా, గోవా నుంచి ఢిల్లీ వంటి ఆరు రూట్లలో నైట్ ఫ్లైట్‌లను ప్రవేశపెట్టింది.
రాత్రి విమానాల్లో రూ 1000 నుంచి విమాన చార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. పన్నులతో కలిపి రూ 1000 నుంచి రూ 3000 మధ్య విమాన చార్జీలు వసూలు చేస్తారు. 15 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుంచి కస్టమర్లు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment