అటు ధరల సెగ : ఇటు గోఎయిర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ | GoAir Offers Flight Tickets From 1099 Rupees | Sakshi
Sakshi News home page

అటు ధరల సెగ : ఇటు గోఎయిర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Sat, Mar 2 2019 3:19 PM | Last Updated on Sat, Mar 2 2019 4:14 PM

GoAir Offers Flight Tickets From 1099 Rupees  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్‌  ఎయిర్‌లైన్‌ గోఎయిర్‌ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో  విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించించింది. డొమెస్టిక్‌ రూట్లలోరూ.1099 (అన్నిచార్జీలు కలుపుకొని), అంతర్జాతీయంగా రూ.4999 (అన్నిచార్జీలు కలుపుకొని) ప్రారంభ ధరలుగా ఆఫర్‌ చేస్తోంది. లిమిటెడ్‌ పీరియడ్‌ఆఫర్‌గా తీసుకొచ్చిన అవకాశం మార్చి4వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబరు 1వతేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. 

కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక‍్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా  పెరిగాయి. ఈ నేపథ్యంలో  బడ్జెట్‌ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్‌ చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement