గో ఎయిర్ 'క్రిస్మస్ క్యాంపెయిన్' ధరలు | GoAir Starts Christmas Sale, Offers Tickets At Rs. 999 | Sakshi
Sakshi News home page

గో ఎయిర్ 'క్రిస్మస్ క్యాంపెయిన్' ధరలు

Published Wed, Dec 21 2016 5:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

గో ఎయిర్ 'క్రిస్మస్ క్యాంపెయిన్' ధరలు

గో ఎయిర్ 'క్రిస్మస్ క్యాంపెయిన్' ధరలు

న్యూఢిల్లీ:  క్రిస్మస్, న్యూ ఇయర్  ఆఫర్ల సందడి మొదలైంది. వరుసగా విమానయానసంస్థలు  భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా  డొమెస్టిక్ క్యారియర్ గో ఎయిర్ వినియోగదారులకు  తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. "క్రిస్మస్ క్యాంపెయిన్''  ఆఫర్ లో భారీ తగ్గింపు ధరలను   అందిస్తోంది. 23 సెక్టార్స్ లో   సేవలు అందిస్తున్న గో ఎయిర్  తన  ఎంటైర్ నెట్వర్కులో పరిమిత కాలానికి రూ.999 లనుంచి ప్రారంభ ధరలను  బుధవారం  ప్రకటించింది.  ఈరోజు (21 డిసెంబర్) నుంచి డిసెంబర్ 1 వరకు ఈ  తగ్గింపుధరల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

"క్రిస్మస్ క్యాంపెయిన్''  ఆఫర్ లో అన్ని చార్జీలు  కలుపుకొని ఈ తగ్గింపు ధరల్ని ఆఫర్ చేస్తోంది.  ఇలా బుక్ చేసుకున్న  టికెట్ల తో జనవరి 9 నుంయి ఏప్రిల్ 15, 2017 ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్టు  ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 999 ఆఫర్ ప్రత్యేకంగా గోఎయిర్ నెట్ వర్క్స్  (గోఎయిర్ వెబ్సైట్, గో ఎయిర్ టికెట్ కౌంటర్లు, గోఎయిర్ కాల్ సెంటర్ మరియు ట్రావెల్ ఏజెంట్లు) అంతటా అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.  పరిమితమై సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్  ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement