రూ.999కే విమాన టిక్కెట్ | GoAir Announces 'Pre-Monsoon' Sale, Offers Tickets Starting Rs. 999 | Sakshi
Sakshi News home page

రూ.999కే విమాన టిక్కెట్

Jun 3 2017 6:12 PM | Updated on Sep 5 2017 12:44 PM

రూ.999కే విమాన టిక్కెట్

రూ.999కే విమాన టిక్కెట్

బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ తాజాగా 'ప్రీ-మాన్ సూన్' సేల్ ను ప్రకటించింది.

బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ తాజాగా 'ప్రీ-మాన్ సూన్' సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ కింద ఎంపికచేసిన దేశీయ రూట్లలో 999 రూపాయలకే విమాన టిక్కెట్ అందించనున్నట్టు పేర్కొంది. 48 గంటలు లేదా రెండు రోజులు అందుబాటులో ఉండే ఈ గోఎయిర్ సేల్ జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలోని ప్రయాణాలకు వర్తించనుందని ఎయిర్ లైన్స్ తెలిపింది. జూన్ 4కు ఈ ఆఫర్ ముగుస్తుంది. ఈ ఆఫర్ ను మిగతా ఏఇతర సేల్ తో కలుపబోమని ఎయిర్ లైన్ చెప్పింది. గ్రూప్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఈ స్పెషల్ ప్రమోషనల్ ధరల కింద టిక్కెట్ బుక్ చేసుకున్న వారు, తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేయమని కూడా స్పష్టంచేసింది.
 
ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచుతుందో కూడా గోఎయిర్ ప్రకటించలేదు. ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్డ్ బేసిస్ లో సీట్లను అందుబాటులో ఉంచే అవకాశముంటుంది. గో ఎయిర్ ప్రస్తుతం 23 ప్రాంతాలకు 140 డైలీ విమానాలను, సుమారు 975 వీక్లి విమానాలను నడుపుతోంది. దేశంలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ మార్చి నెలలో 14.6 శాతం వృద్ధి నమోదుకాగ ఏప్రిల్ నెలలో 15.3 శాతానికి పెరిగిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ డేటా తెలిపింది.  
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement