
సాక్షి, ముంబై: బడ్జెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ దేశీయ మార్కెట్లో డిస్కౌంట్ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ రూట్లలోఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. వివిధ రూట్లలో టికెట్లపై రూ.2500 డిస్కౌంట్ ఆపర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఫ్లై స్మార్ట్ పేరుతో ఈ డిస్కౌంట్ రేట్లను అందిస్తోంది. ఇందుకుగాను జూమ్‌కార్, లెన్స్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 10వరకు చేసుకునే బుకింగ్‌లకు ఆఫర్ వర్తించనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 10, 2018 వరకు ప్రయాణాలకు అనుమతి. అలాగే గో ఎయిర్ మొబైల్ యాప్ లేదా, వెబ్‌సైట్ ద్వారా చేసుకున్న జూమ్‌కార్ బుకింగ్‌పై 1200 రూపాయలు, లెన్స్‌కార్ట్‌పై వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ను గో ఎయిర్ అందిస్తోంది. దీంతో పాటు GOAPP10 ప్రోమోకోడ్ పై 10శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఉంది.
నోట్: ఫిబ్రవరి 23, మార్చి 4, ఏప్రిల్ 4, ఏప్రిల్ 15, జూలై 15, 2018 తేదీలకు ఈ ఆఫర్ వర్తించదని గోఎయిర్ వెల్లడించింది.
Vacation mode ON! ✔#FlySmart from Mumbai at fares starting Rs 1844*.
— GoAir (@goairlinesindia) February 1, 2018
Book now: https://t.co/C1GFSeRXtz pic.twitter.com/D85CMAGe7K