రూ.1,313కే గో ఎయిర్‌ టికెట్‌... | GoAir offers 13 lakh seats on sale, flight tickets starts from Rs 1313 | Sakshi
Sakshi News home page

రూ.1,313కే గో ఎయిర్‌ టికెట్‌...

Published Wed, Nov 7 2018 12:20 AM | Last Updated on Wed, Nov 7 2018 8:21 AM

GoAir offers 13 lakh seats on sale, flight tickets starts from Rs 1313 - Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ రూ.1,313(అన్నీ కలుపుకొని) ధరకే విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 13 లక్షల సీట్లను ఆఫర్‌ చేస్తున్నామని గోఎయిర్‌ తెలిపింది. ఈ టికెట్లకు బుకింగ్స్‌ ఈ నెల 5 నుంచే ఆరంభమయ్యాయని, ఈ నెల 18 వరకూ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని గోఎయిర్‌ సీఈఓ కార్నిలిస్‌ వీస్‌జివిక్‌ పేర్కొన్నారు. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్లతో  వచ్చే ఏడాది నవంబర్‌ 4 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు.

2005, నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారం భించామని, విమాన సర్వీస్‌లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో అందిస్తున్నామని వివరించారు. మరోవైపు జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థ తన దివాలీ ఆఫర్‌ను ఈ నెల 11 వరకూ పొడిగించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఈ కంపెనీ దేశీ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement