
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ విమానయాన సంస్థ ‘ఇండిగో’, త్వరితగతి వృద్ధి పథంలో దూసుకెళ్తోన్న మరో ఎయిర్‌లైన్స్ ‘గోఎయిర్’ రెండూ కూడా రిపబ్లిక్ డే ఆఫర్ల జాబితాలోకి చేరాయి. సోమవారమే స్పైస్‌జెట్ ఈ ఆఫర్లు ప్రకటించగా... మంగళవారం ఇవి కూడా తమ డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు వెల్లడించాయి.
ఇండిగో..: ఈ విమానయాన సంస్థ రిపబ్లిక్ డే సందర్భంగా రూ.797 ప్రారంభ ధరతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. జనవరి 25 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్నవారు ఏప్రిల్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఎంపిక చేసిన ఫ్లైట్స్‌కు, పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అంటే ఆఫర్‌లోని సీట్లు భర్తీ అయితే అప్పుడు టికెట్ బుకింగ్‌కు సాధారణ చార్జీలే వర్తిస్తాయి. ఇక గ్రూప్ బుకింగ్స్‌కు ఆఫర్ వర్తించదు.
గోఎయిర్..: ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ రూ.1,326 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. జనవరి 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మార్చి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. కాగా డిస్కౌంట్ ఆఫర్ పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక అదనంగా ప్రతి టికెట్ బుకింగ్‌పై రూ.2,500 విలువైన ప్రయోజనాలు పొందొచ్చని పేర్కొంది.