600కి పైగా దేశీయ విమానాలు రద్దు | IndiGo GoAir To Cancel Over 600 Flights | Sakshi
Sakshi News home page

600కి పైగా దేశీయ విమానాలు రద్దు

Published Fri, Mar 16 2018 11:27 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

IndiGo GoAir To Cancel Over 600 Flights - Sakshi

ముంబై : ఇండిగో, గోఎయిర్‌ కలిసి ఈ నెలలో 600కి పైగా దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు గురువారం ఈ ఎయిర్‌లైన్స్‌ సమర్పించిన షెడ్యూల్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇండిగో 488 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా.. గోఎయిర్‌ 138 విమానాలను రద్దు చేయబోతున్నట్టు తెలిసింది. రద్దు అయిన విమానాల జాబితాలను ఈ విమానయాన సంస్థలు తమ సంబంధిత వెబ్‌సైట్లలో పొందుపరిచాయి. ఈ రెండు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఆఫర్‌ చేస్తుండటంతో పాటు, మొత్తం నగదును రీఫండ్‌ చేస్తున్నాయి. 

ఈ రద్దుతో దాదాపు లక్ష మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారని తెలిసింది. వచ్చే నెల నుంచి వేసవి సెలవుల షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుండటంతో, ఈ రద్దు ప్రభావం అప్పుడు కూడా ఉండబోతోంది. ఏప్రిల్‌లో విమానయాన సంస్థలకు ఎంతో డిమాండ్‌ ఉన్న ట్రావెల్‌ సీజన్‌. డిమాండ్‌ ఎక్కువగా ఉండి, విమానాల రద్దు ఉండటంతో, వచ్చే నెలలో విమానాల ధరలు పెరుగనున్నాయి. ఇండిగో, గోఎయిర్‌ కలిసి రోజూ 1200 విమానాలను నడుపుతున్నాయి. ఫ్రాట్‌, విట్నీ తయారు చేసిన ఇంజిన్లలో తలెత్తిన సమస్యల కారణంగా ఇరు సంస్థలు విమానాలను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 15 నుంచి 31 మధ్యలో ఇండిగో 488 విమానాలను క్యాన్సిల్‌ చేయగా.. గోఎయిర్‌ మార్చి 15 నుంచి 22 వరకు 138 విమానాలను రద్దు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement