గోఎయిర్ ‘999’ ఆఫర్
ముంబై: కస్టమర్ల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా దేశీ విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా పరిమిత కాల టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ విమాన టికెట్లను రూ.999 నుంచి ఆఫర్‌చేస్తోంది. డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకున్న వారు 2017 జనవరి 9 –ఏప్రిల్ 15 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కాగా రూ.999 ఆఫర్‌కేవలం గోఎయిర్ నెట్‌వర్క్స్ (గోఎయిర్ వెబ్‌సైట్, గోఎయిర్ టికెటింగ్ కౌంటర్స్, గోఎయిర్ కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్స్)లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వివరించింది.