ఆ సీఈవో మా డేటా దొంగలించారు  | After Bitter Exit, GoAir Former CEO Charged With Data Theft By Airline | Sakshi
Sakshi News home page

ఆ సీఈవో మా డేటా దొంగలించారు 

Published Mon, Apr 30 2018 4:48 PM | Last Updated on Mon, Apr 30 2018 4:48 PM

After Bitter Exit, GoAir Former CEO Charged With Data Theft By Airline - Sakshi

వోల్ఫ్‌గ్యాంగ్‌ ప్రోక్‌ స్కావియర్‌... ఒకప్పుడు గోఎయిర్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ప్రమోటర్లతో నెలకొన్న వివాదాలతో ఆయన గోఎయిర్‌కు గుడ్‌బై చెప్పారు. గోఎయిర్‌ నుంచి వెళ్లిపోయిన స్కావియర్‌, దాని ప్రత్యర్థి కంపెనీ ఇండిగోలో జనవరి చివరి నుంచి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే అంతకముందు తమ సంస్థలో పనిచేసిన స్కావియర్‌, తమ డేటాను దొంగలించాడంటూ గోఎయిర్‌ ఆరోపిస్తోంది. అంతేకాక ఆయన నియామకంపై కూడా గోఎయిర్‌ బొంబై హైకోర్టు దావా దాఖలు చేసింది. ఈ దావాలో తమ రహస్య సమాచారాన్ని స్కావియర్‌ బహిర్గతం చేయకుండా నిరోధించాలని కోరింది. ఇద్దరు పోటీదారుల మధ్య పోరాటంలో స్కావియర్‌ను బలిపశువును చేస్తున్నారంటూ స్కావియర్‌ తరుఫున వాదిస్తున్న న్యాయవాది జనక్‌ ద్వారకాదాస్‌ ఆరోపిస్తున్నారు. గోఎయిర్‌లో చేరకముందు ఆస్ట్రేలియన్‌ అయిన స్కావియర్‌‌, జెట్‌ ఎయిర్‌వేస్‌లో పనిచేసేవారు. 

జూన్‌తో గోఎయిర్‌లో ముందుగా నిర్ణయించిన స్కావియర్‌ కాంట్రాక్ట్‌ ముగియబోతోంది. కానీ కొన్ని నెలల ముందు గానే ఆయను తన పదవికి రాజీనామ చేసేశారు. ప్రమోటర్లకు, స్కావియర్‌కు మధ్య నెలకొన్న వివాదాలే ఆయన రాజీనామాకు కారణమయ్యాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్కావియర్‌ వైదొలగడానికి కొన్ని రోజుల ముందు నుంచి కంపెనీ మేనేజ్‌మెంట్‌ నిర్మాణాన్ని మార్చి వేయడం ప్రారంభించింది. స్కావియర్‌ విదేశీ పైలెట్లను ఎక్కువగా నియమించుకుంటున్నారని గోఎయిర్‌ ప్రమోటర్లు ఎక్కువగా గుర్రుగా ఉండేవారని, ఆ విషయంలోనే వారికి వివాదాలు నెలకొన్నాయని ఫిబ్రవరిలో ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement