గోఎయిర్‌ భారీ డిస్కౌంట్‌ | GoAir offers heavy discounts on select routes | Sakshi
Sakshi News home page

గోఎయిర్‌ భారీ డిస్కౌంట్‌

Published Fri, Nov 24 2017 4:55 PM | Last Updated on Fri, Nov 24 2017 8:22 PM

GoAir offers heavy discounts on select routes - Sakshi - Sakshi

ముంబై : దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన మార్గాలకు అతి తక్కువకు రూ.312కే టిక్కెట్లను విక్రయిస్తోంది. ఢిల్లీ, కొచ్చి, బెంగళూరులను కలుపుకుని ఏడు నగరాలకు వన్‌-వే జర్నీకి ఈ టిక్కెట్‌ ధరలను ఆఫర్‌ చేస్తుంది. శుక్రవారం నుంచి బుక్‌ చేసుకునే టిక్కెట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఫస్ట్‌-కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌డ్‌ బేసిస్‌లో, పరిమిత కాల వ్యవధిలో ఈ ఆఫర్‌ అందించనున్నట్టు గోఎయిర్‌ విమానయాన సంస్థ ప్రకటించింది.

ఈ డిస్కౌంట్‌ ధరల్లో పన్నులను కలుపలేదు. డిసెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్‌ 28 వరకు ప్రయాణాలకు ఇది వాలిడ్‌లో ఉండనుంది. నేటి నుంచి నవంబర్‌ 29 వరకు ఈ ఆఫర్‌పై టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. న్యూఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, లక్నో మార్గాలకు ఈ ప్రత్యేక ధరలు అందుబాటులో ఉండనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement